Fake News, Telugu
 

సంబంధం లేని పాత ఫోటోను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు గుంతలను కొబ్బరి బోండాలతో పూడ్చినట్టు షేర్ చేస్తున్నారు

0

రోడ్డుపై ఉన్న గుంతను కొబ్బరి బోండాలతో పూడ్చినట్టు ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి ఇట్లా ఉంది అన్నట్టు కొత్త ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ షేర్ చేస్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ ఫొటోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డుపై ఉన్న గుంతను కొబ్బరి బోండాలతో పూడ్చిన ఫోటో.

ఫాక్ట్(నిజం): ఈ ఫోటో చాలా సంవత్సరాల నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. 2017లో అనేక పోర్చుగీస్ బ్లాగ్స్ దీనిని షేర్ చేసాయి. ఐతే ఈ రోడ్డు ఎక్కడిది అనే కచ్చితమైన సమాచారమైతే లేదు. కాకపోతే ఈ ఫోటో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రోడ్లకు సంబంధించింది కాదు అని మాత్రం స్పష్టమవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

రోడ్డుపై గుంతను కొబ్బరి బోండాలతో పూడ్చిన ఈ ఫోటో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఫోటో చాలా సంవత్సరాల నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోను 2017లో షేర్ చేసిన పలు పోర్చుగీస్ బ్లాగ్స్/సోషల్ మీడియా పోస్ట్స్ మాకు కనిపించాయి (ఇక్కడ & ఇక్కడ). ఐతే ఈ ఫోటో ఎక్కడిది అనే కచ్చితమైన సమాచారం ఈ పోస్టులలో కూడా లేదు.

ఆ తరవాత కూడా ఈ ఫోటో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూ వచ్చింది (ఇక్కడ & ఇక్కడ). ఐతే ఈ ఫోటో ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న టైం బట్టి, దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది.

కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఫోటో ప్రస్తుత రాష్ట్రానికి సంబంధించింది కాదని వివరణ ఇచ్చింది. తమ ఫాక్ట్-చెకింగ్ యూనిట్ ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

చివరగా, సంబంధం లేని పాత ఫోటోను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు గుంతలను కొబ్బరి బోండాలతో పూడ్చినట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll