Fake News, Telugu
 

ప్రధాని మోదీ అఖండ-2 చిత్రాన్ని చూస్తున్న నిజమైన వీడియో అని చెప్తూ ఒక సంబంధం లేని ఎడిటెడ్ వీడియోను షేర్ చేస్తున్నారు

0

12 డిసెంబర్ 2025న విడుదలైన అఖండ-2/ అఖండ తాండవం చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో చూడబోతున్నారు అని ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శీను చెప్పిన నేపథ్యంలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), ఆయన ఆఫీసులోని (PMO) ఒక టీవీలో అఖండ-2 చిత్రం చూస్తున్న దృశ్యాలని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రధాని మోదీ తన ఆఫీసులో అఖండ-2 చిత్రాన్ని చూస్తున్న వీడియో.

ఫ్యాక్ట్(నిజం): ఇది ఒక ఎడిటెడ్ వీడియో. ప్రధాని మోదీ జూలై 2019లో చంద్రయాన్-2 లాంచ్ యొక్క దృశ్యాలను టీవీలో చూస్తున్న వీడియోను ఎడిట్ చేసి దీన్ని తయారు చేశారు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, డిసెంబర్ 2025లో అఖండ-2 చిత్రాన్ని ప్రధాని మోదీ చూసారని చెప్తూ మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు. 

ఆ తర్వాత, వీడియో గురించి మరిన్ని వివరాల కోసం, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసాము. ఈ సెర్చ్ ద్వారా, ఈ వీడియో యొక్క అసలు వెర్షన్ మాకు లభించింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 

22 జూలై 2025న ప్రధాని నరేంద్ర మోదీ చంద్రయాన్-2 మిషన్ లాంచ్‌ని తన ఆఫీసులోని ఒక టీ.వీలో చూస్తూ హర్షిస్తున్న వీడియో ఇది. దీన్ని ఎడిట్ చేసి, ఆయన అఖండ-2 చిత్రాన్ని చూస్తున్న దృశ్యాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఈ 2019 నాటి వీడియో ఇంకా వైరల్ వీడియో మధ్య ఉన్న పోలికను మీరు ఈ క్రింది ఫోటోలో చూడవచ్చు. 

చివరగా, 2019లో చంద్రయాన్-2 లాంచ్‌ని ప్రధాని మోదీ చూస్తున్న వీడియోని ఎడిట్ చేసి, ఆయన ఇటీవల అఖండ-2 చూస్తున్నప్పుడు తీసిన దృశ్యాలని తప్పుడు క్లెయిమ్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll