AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ శివుడికి అంకితం చేసిన హిందూ శ్లోకం అయిన శివతాండవ స్తోత్రాన్ని పాడినట్లు చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ ఆర్టికల్ ద్వారా, ఈ క్లెయిమ్ యొక్క నిజానిజాలను తెలుసుకుందాం.
క్లెయిమ్: అసదుద్దీన్ ఒవైసీ శివతాండవ స్తోత్రం పాడుతున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో 2022లో కర్ణాటకలోని బీజాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ చేసిన ప్రసంగం యొక్క ఎడిట్ చేసిన వెర్షన్. ఈ ప్రసంగంలో ఎక్కడా తాను నిజంగా శివ స్తోత్రం పాడలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ క్లైయిముని ధృవీకరించడానికి, ముందుగా, మేము వైరల్ వీడియోకి చెందిన కొన్ని కీఫ్రేమ్‌లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ ద్వారా, 2022లో కర్ణాటకలోని బీజాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రసంగం యొక్క అసలు వీడియోకి దొరికింది(ఇక్కడ, ఇక్కడ).
ఈ స్పీచ్ వీడియోలో 9:39 సెకన్ల వద్ద వచ్చే దృశ్యాలు వైరల్ వీడియోతో మ్యాచ్ అవుతున్నాయి. ఈ భాగంలోనే కాదు కదా, అసలు ఈ వీడియోలో ఆయన ఎక్కడ కూడా అసదుద్దీన్ శివ స్తోత్రం పాడలేదు.
వైరల్ వీడియోలో ఒవైసీ ప్రసంగం యొక్క ఆడియోని శివ తాండవ స్తోత్రం యొక్క ఆడియోని జోడించి ఎడిట్ చేయబడి ఉండవచ్చని అనుమానిస్తూ, ఒరిజినల్ ఆడియో కోసం వెతకడానికి మేము ఇంటర్‌నెట్‌లో కీవర్డ్ సెర్చ్ నిర్వహించాము. ఇక్కడ, అరవింద్ త్రివేది అనే ఒకతను, శివతాండవ స్తోత్రం పాడిన యూట్యూబ్ వీడియో మాకు కనిపించింది.
ఈ వీడియోలోని ఆడియో(శివతాండవ స్తోత్రం) వైరల్ వీడియోలో ఉన్న దానితో సరిగ్గా సరిపోలుతుంది. దీనివల్ల, వైరల్ వీడియో మార్ఫింగ్ చేసిన వీడియో అని తేలింది. ఇంతే కాక, AIMIM ప్రతినిధి మొహమ్మద్ సల్మాన్ ఈ వీడియో గురించి విశ్వాస్ న్యూస్ వారితో మాట్లాడుతూ, ఇది ఒక ఎడిట్ చేసిన వీడియో అని స్పష్టం చేశారు.
చివరిగా, వైరల్ వీడియోలో అసదుద్దీన్ ఒవైసీ శివతాండవ స్తోత్రం పాడుతున్నారనే వాదన నిజం కాదు. ఈ వీడియో కర్ణాటకలోని బీజాపూర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ఒవైసీ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో యొక్క ఎడిట్ చేసిన వెర్షన్.