Deepfake, Fake News, Telugu
 

నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంపై నిద్రిస్తున్న వ్యక్తి దగ్గరికి సింహం వెళ్ళినట్లు చూపిస్తున్న ఈ వీడియో AI ద్వారా రూపొందించబడింది

0

నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంపై నిద్రిస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి సింహం రాగా, అతను వెంటనే భయంతో పారిపోతున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఇది నిజమైన ఘటనగా పలువురు యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంపై నిద్రిస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి సింహం రాగా, అతను వెంటనే భయంతో పారిపోతున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో నిజమైన సంఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోను జాగ్రతగా పరిశీలిస్తే, ఇందులో పలు తప్పిదాలు/ అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న మనిషి మొహం, సింహం అసహజంగా ఉండటం మనం చూడవచ్చు. అలాగే పలు దృశ్యాలలో సింహం శరీర భాగాలు భవనం యొక్క పిల్లర్‌లో, గోడలలో కలిసిపోవడాన్ని మనం చూడవచ్చు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన దృశ్యాలలో ఇటువంటి లోపాలు సహజంగానే ఉంటాయి (ఇక్కడఇక్కడ). దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించి ఉండవచ్చని తెలుస్తోంది.

తదుపరి ఈ వీడియోకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను (ఆర్కైవ్డ్), 16 జూన్ 2025న టిక్‌టాక్‌లో ‘@ataquesferoz’ అనే యూజర్ అప్‌లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో వివరణలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఈ వీడియో రూపొందించినట్లు యూజర్ పేర్కొన్నారు.

ఈ వైరల్ వీడియో AI- ఉపయోగించి తయారు చేసిందా? లేదా? అని నిర్ధారించడానికి, DeepFake-O-Meter వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి ఈ వీడియోను పరిశీలించగా, ఈ వైరల్ వీడియో AI- జనరేటెడ్ కావచ్చని ఫలితాన్ని ఇచ్చాయి. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంపై నిద్రిస్తున్న వ్యక్తి దగ్గరికి సింహం వెళ్ళినట్లు చూపిస్తున్న ఈ వీడియో AI ద్వారా రూపొందించబడింది.

Share.

About Author

Comments are closed.

scroll