ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లో, Dr. బీ.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిర్వహించారని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లో జరిగిన Dr. బీ.ఆర్. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను చూపిస్తున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో. ఉత్తర కొరియాలో ఇలాంటి వేడుకలు జరిగినట్లు ఎటువంటి విశ్వసనీయ సమాచారం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఉత్తర కొరియాలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించినట్లు చెప్తూ, మాకు ఎటువంటి విశ్వసనీయ సమాచారం లభించలేదు. ఉత్తర కొరియాలో ఇటువంటి సంఘటన జరిగి ఉంటే తప్పకుండా దాన్ని ప్రపంచ స్థాయి మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి.
వైరల్ వీడియోని పరిశీలిస్తున్న సమయంలో, అందులో ‘PK UNIQUE STORY’ అనే వాటర్‌మార్క్ ఉండటం మేము గమనించాము. ఈ టెక్స్ట్ ఉపయోగించి ఇంటర్నెట్లో కీవర్డ్ సెర్చ్ చేయగా, ఇదే పేరుతో ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్లో మాకు వైరల్ వీడియో యొక్క అసలు వెర్షన్ లభించింది. ఈ వీడియోను 23 ఏప్రిల్ 2025, ఉత్తర కొరియాలో అంబేడ్కర్ జయంతి వేడుకలు అనే అర్థంతో ఉన్న హిందీ టైటిల్‌తో అప్లోడ్ చేశారు.

ఈ వీడియో పైన ఇది ‘Altered or synthetic content’ అనగా ఎడిట్ చేసిన లేదా డిజిటల్‌గా తయారు చేసిన ఆడియో/వీడియో ఇందులో ఉంది అని వీడియో యొక్క వివరణలో ఉంది.

ఇది వెరిఫై చేయడానికి సుమారు ఈ 5 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలోని 14 సెకన్ల బాగాన్ని కట్ చేసి, AI కంటెంట్ డిటెక్షన్ టూల్స్ అయిన Hive, Cantiluxను ఉపయోగించి చెక్ చేసాము. ఈ రెండు టూల్స్ యొక్క ఎనాలిసిస్ రిపోర్టుల ఫలితాల్లో వైరల్ వీడియో AI ఉపయోగించి తయారు చేయబడింది అని పేర్కొన్నాయి(ఇక్కడ, ఇక్కడ).


చివరగా, ఉత్తర కొరియాలో Dr. బీ.ఆర్. అంబేడ్కర్ జన్మదిన వేడుకలు జరిగాయి అని చెప్తూ ఒక AI-జనరేటెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు.