Fake News, Telugu
 

స్టేషన్ బెయిల్ పొందే ప్రక్రియ రద్దు కాలేదు. 41A CrPCకి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయలేదు

0

‘ఇక నుంచి పోలీస్ స్టేషన్ బెయిల్ రద్దు…పోలీసు శాఖలో అవినీతిని అరికట్టడానికి కేంద్ర న్యాయ శాఖ 41A crpc ని సవరించింది’ అంటూ ఒక పోస్టు సోషల్ మీడియా చాలా షేర్ అవుతోంది. ఇప్పుడు ఇలా చేయడానికి కారణాలు అంటూ ఒక వీడియోని కూడా షేర్ చేస్తున్నారు. అసలు పోలీస్ స్టేషన్ బెయిల్ నిజంగా రద్దు అయ్యిందా? 41A CrPCకి కేంద్ర ప్రభుత్వం ఏమన్నా మార్పులు చేసిందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వీడియో యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పోలీస్ డిపార్ట్మెంట్ లో అవినీతిని తగ్గించే క్రమంలో కేంద్ర న్యాయశాఖ CrPC లోని సెక్షన్ 41Aని సవరించి పోలీస్ స్టేషన్ లో ఇచ్చే బెయిల్ పద్ధతిని నిలిపివేసింది.

ఫాక్ట్ (నిజం): ఇటివల కాలంలో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ CrPC లోని సెక్షన్ 41Aకు ఎటువంటి సవరణలు చేయలేదు. అంతే కాదు, 2008 ఇంకా 2010లో పార్లమెంట్ ఆమోదించిన CrPC సవరణ చట్టాలు 2015లో ఉపసంహరించినప్పటికీ , జనరల్ క్లాసెస్ చట్టం (1897) ప్రకారం సవరణ చట్టాన్ని ఉపసంహరించినప్పుడు ఆ సవరణ చట్టం ద్వారా అసలు చట్టానికి చేసిన సవరణలు తొలగించబడవు. ఒకవేళ అసలు చట్టం లోని ఏదైనా నిబంధనని గానీ లేక మొత్తం చట్టాన్నీ గానీ తొలగించాలనుకుంటే ప్రత్యేకంగా వేరొక చట్టం ద్వారా మాత్రమే అది సాధ్యం. అంతవరకు అసలు చట్టంలోని నిబంధనలు యధాతధంగా ఉన్నట్టే. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులోని విషయం గురించి వెతకగా, ఇదే మెసేజ్ 2015 నుంచి ప్రచారంలో (ఆర్కైవ్) ఉందని తెలిసింది. 2015లో ఇదే బాగా వైరల్ అయినప్పుడు ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఇదే సమాచారాన్ని ప్రసారం చేసాయి. NTV Telugu (వీడియో1, వీడియో2), V6 News Telugu, TV5 News కూడా 2015లో ఈ సమాచారాన్ని ప్రసారం చేసినట్టు తెలిసింది. ఇప్పుడు మళ్ళీ ఈ మెసేజ్ వైరల్ అవుతున్న నేపథ్యంలో The Times of India సమయం (ఆర్కైవ్) కూడా ఒక కథనాన్ని ప్రచురించింది.

అసలు ఇటువంటి మెసేజ్ ఇంకా కథనాలు 2015లో ఎందుకు ప్రచారం అయ్యాయి అని విశ్లేషిస్తే, 2015లో పార్లమెంట్ ఆమోదించిన ఒక ఉపసంహరణ చట్టం (Repeal Act) కారణం అని తెలిసింది.

The Repealing and Amendment (Second) Act, 2015 ద్వారా Code of Criminal Procedure Act (CrPC)కి 2008 & 2010 లో చేసిన సవరణ చట్టాలను ఉపసంహరించారు. దీనితో పోలీస్ స్టేషన్ లో ‘స్టేషన్ బెయిల్’ ఇచ్చే అధికారం పోలీసుల నుండి తొలగించారని, ఇప్పటి నుండి ఏ కేసులోనైన బెయిల్ కొరకు కోర్టును సంప్రదించాల్సిందే అని 2015లో ఆమోదించిన ఈ ఉపసంహరణ చట్టం ఆధారంగా ఈ కథనాలు ప్రసారం అయ్యాయి. కాని ఒక సవరణ చట్టాన్ని ఉపసంహరించినంత మాత్రాన ఆ సవరణ చట్టం ద్వారా చేసిన సవరణలు కూడా తొలగించబడతాయో లేదో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

What is an Amendment?The modification of materials by addition of supplemental information;  the deletion of unnecessary, undesirable, or outdated information; or  the correction of errors existing in the text.

ది జనరల్ క్లాసెస్ చట్టం,1897 ప్రకారం “Repeal of act making textual amendment in act orregulation- Where any central act or regulation made after the commencement of this act repeals any enactment by which the text of any central act regulation amended by the express omission, insertion or substitution of any matter then, unless a different intention appears, the repeal shall not affect the continuance of any such amendment.”

దీన్ని బట్టి ఒక సవరణ చట్టాన్ని ఉపసంహరించినప్పుడు ఆ చట్టం ద్వారా అసలు చట్టానికి చేసిన సవరణలు తొలగించబడవని అర్ధమవుతుంది. ఒకవేళ అసలు చట్టం లోని ఏదైనా నిభంధనని గానీ లేక మొత్తం చట్టాని గానీ సవరించాలనుకుంటే ప్రత్యేకంగా వేరొక చట్టం ద్వారా మాత్రమే అది సాధ్యం. అంతవరకు అసలు చట్టంలోని నిబంధనలు (సవరణలతో సహా) యధాతధంగా ఉన్నట్టే అర్ధం. సాధారణంగా ఉపసంహరణ చట్టాల (Repeal Act) ద్వారా శాసనంలోని అనవసరమైన విషయాలు తొలగిస్తారు. ఇంకా ఉపసంహరణ చట్టాల ద్వారా సవరణ చట్టాలను తొలగిస్తారు. పార్లమెంట్ లైబ్రరీ లోని రేఫెరెంస్ నోట్ ప్రకారం ఏదైనా చట్టానికి సవరణలు చేసిన తరవాత ఇంకా ఆ సవరణ చట్టాల ప్రత్యేక ఉపయోగం ఏమీ లేదు. చట్టాల సంఖ్య, శాసనాల పరిమాణం ఎక్కువ కాకుండా సమయానుకూలంగా సవరణ చట్టాలను ఉపసంహరిస్తారు. అవసరం లేని చట్టాల ఉపసంహరణ గురుంచి ఇంకా తెలుసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు సభ్యుల కమిటీ రిపోర్ట్ ని ఇక్కడ చదవండి.

ఒక ఉదాహరణ ద్వారా ఇది చూద్దాం. హిందూ వారసత్వ చట్టం, 2005 ద్వారా హిందూ వారసత్వ చట్టం, 1956కి సవరణలు చేసారు. ఈ సవరణల ప్రకారం ఈ సవరణలు అమలు అయిన రోజునుండి మిత్కర్షర లా ప్రకారం నడిచే ఉమ్మడి హిందూ కుటుంబంలోని స్త్రీలకు క్రింద పేర్కొన్న హక్కులు వర్తిస్తాయి.

  • తన హక్కులకు లోబడి, కుమారుడి లాగే తను కూడా పుట్టినప్పటి నుండి ఉమ్మడి వారసురాలు.
  • తను ఒక అబ్బాయి ఐతే ఎలాంటి ఉమ్మడి వారసత్వ హక్కులు వర్తిస్తాయో ఇప్పుడు తనకు కూడా అవే హక్కులువర్తిస్తాయి.
  • ఒక అబ్బాయి కి ఎలాంటి బాధ్యతలు వర్తిస్తాయో, ఉమ్మడి వారసురాలు అయిన కారణంగా తనకి కూడా అవే బాధ్యతలు వర్తిస్తాయి.

Repealing and Amendment (Second) Act, 2015 ద్వారా హిందూ వారసత్వ చట్టం, 2005ను కూడా ఉపసంహరించారు. అంత మాత్రాన, 2005 చట్టం ద్వారా చేసిన సవరణలు మాత్రం తొలగింపబడలేదు. ఎందుకంటే, 2015 తరవాత వచ్చిన అనేక కోర్ట్ కేసులలో 2005లో చేసిన సవరణల ఆధారంగానే తీర్పు చెప్పడం జరిగింది. దినికి ఉదాహరణ  Dannama @ Suman Surpur Vs Aman & others కేసులో సుప్రీమ్ కోర్టు 2005లో చేసిన సవరణల ఆధారంగానే 2018లో తీర్పు చెప్పింది.

అలాగే లోక్ సభ, రాష్ట్రాలలోని అసెంబ్లీ నియోజకవర్గాలను 2001 సెన్సస్ డేటా ప్రకారం పునర్విభజన చేయడం కోసం చేసిన  Delimitation Amendment Act, 2002 ను Repealing and Amendment (Second) Act, 2015 ద్వారా ఉపసంహరించారు. కానీ 2002 చట్టం ద్వారా చేసిన సవరణలు యధాతదంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న లోక్ సభ, రాష్ట్రాలలోని అసెంబ్లీ నియోజికవర్గాలు 2002 లో చేసిన సవరణల ఆధారంగా నిర్ధారించినవే.

CrPC కి 2008 లో చేసిన సవరణలు ఏమిటి?

2008లో చేసిన సవరణల ద్వారా Code of Criminal Procedure Act, 1973 లోకి 41A, 41B, 41C అనే సెక్షన్ లను జతచేసారు.

41A. Notice of appearance before police officer –

(1) The police officer may, in all cases where the arrest of a person is not required under the provisions of sub-section(1) of section 41, issue a notice directing the person against whom a reasonable complaint has been made, or credible information has been received, or a reasonable suspicion exists that he has committed a cognizable offence, to appear before him or at such other place as may be specified in the notice.

(2) Where such a notice is issued to any person, it shall be the duty of that person to comply with the terms of the notice.

(3) Where such person complies and continues to comply with the notice, he shall not be arrested in respect of the offence referred to in the notice unless, for reasons to be recorded, the police officer is of the opinion that he ought to be arrested.

(4) Where such person, at any time, fails to comply with the terms of the notice or is unwilling to identify himself, the police officer may, subject to such orders as may have been passed by a competent Court in this behalf, arrest him for the offence mentioned in the notice.”

41B. Procedure of arrest and duties of officer making arrest Procedure of arrest and duties of officer making arrest. – Every police officer while making an arrest shall-

(a) bear an accurate, visible and clear identification of his name which will facilitate easy identification.

(b) prepare a memorandum of arrest which shall be-

(i) attested by at least one witness, who is a member of the family of the person arrested or a respectable member of the locality where the arrest is made.

(ii) countersigned by the person arrested and

(c) inform the person arrested, unless the memorandum is attested by a member of his family, that he has a right to have a relative or a friend named by him to be informed of his arrest.

సెక్షన్ 41A CrPC పై సుప్రీం కోర్టు అభిప్రాయాలు

అరెస్ట్ చేయడానికి వారెంట్ అవసరం లేనటువంటి IPC 498A వంటి సెక్షన్లలో పోలీసులు అధికార దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో, పైన పేర్కొన్న సవరణలు కొంత చర్చనీయాంశం అయినాయి. ఈ ఆరోపణల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం Code of Criminal Procedure Act, 2008ను Code of Criminal Procedure Act, 2010 ద్వారా సవరించింది. ఈ సవరణల ప్రకారం 2008 చట్టంలో పోలీసులకి ఆప్షనల్ గా ఉన్న నిబంధనలని తప్పనిసరి చేసింది.

2014లో IPC సెక్షన్ 498Aతో ముడిపడిన Arnesh kumar Vs State of Bihar కేసులో సుప్రీం కోర్టు ఈ సెక్షన్ ని బాధిత భార్యలు ఒక కవచానికి బదులుగా ఒక ఆయుధంగా వాడుతునారని అభిప్రాయపడింది. ఇంకా ఈ సెక్షన్ కింద ఫిర్యాదులు వచ్చినప్పుడు వచ్చినప్పుడు అవసరమైతే తప్ప వెంటనే అరెస్ట్ చేయకుండా పోలీసులకి సూచించాలని కోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కోరింది. అలాగే అరెస్ట్ చేయడానికి సరిపడ ఆధారాలు మేజిస్ట్రేట్ కి సమర్పించాలని ఆదేశించింది. దీనికనుగుణంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2014లో గైడ్లైన్స్ విడుదల చేసింది.

2017లో Rajesh Sharma vs State of U.P  కేసులో కూడా IPC సెక్షన్ 498A లో, CrPC లోని సెక్షన్ 41A ద్వారా అధికార దుర్వినియోగంపై సుప్రీం కోర్టు ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది.

2018లో National Crime Record Bureau (NCRB) రిపోర్ట్ ప్రకారం ఒక లక్షకు మించి కేసులు IPC సెక్షన్ 498A కింద నమోదు అయ్యాయి. మహిళల పై నేరాల కేసులలో 27.3% ఈ సెక్షన్ కింద నమోదైనవే. కాని 2018లో ఈ సెక్షన్ కింద నేర నిరూపణ జరిగిన కేసుల శాతం మాత్రం 13%గా ఉంది. అయితే కేవలం నేర నిరూపణ శాతం తక్కువగా ఉన్న కారణంగా ఈ సెక్షన్ ని దుర్వినియోగ పరుస్తునరనే వాదన సరైనది కాదు.

వీటన్నిటి అర్థం ఏమిటి?

పైన చెప్పిన వివరణ ప్రకారం, సవరణ చట్టాన్ని ఉపసంహరించినప్పుడు ఆ చట్టం ద్వారా అసలు చట్టానికి చేసిన సవరణలు తొలగించబడవు. ఒకవేళ అసలు చట్టం లోని ఏదైనా నిభంధనని గానీ లేక మొత్తం చట్టాని గానీ తొలగించాలనుకుంటే ప్రత్యేకంగా వేరొక చట్టం ద్వారా మాత్రమే అది సాధ్యం. అంతవరకు అసలు చట్టంలోని నిబంధనలు యధాతధంగా ఉన్నట్టే అని కచ్చితంగా చెప్పొచు. 2018 & 2019లో కూడా చాలా రాష్ట్రాలు తమ పోలీస్ శాఖ కి CrPC లోని సెక్షన్ 41Aకి సంభందించి ఇలాంటి సూచనలే చేసింది. దీన్ని బట్టి Repealing and Amendment (Second) Act, 2015 ద్వారా 2008 & 2010లో చేసిన సవరణలు ఉపసంహరించినా గాని CrPC 41A కింద నిభందనలు అలాగే ఉన్నాయి. వాటిలో ఎటువంటి మార్పు లేదు. అంతే కాదు, న్యాయ మంత్రిత్వ శాఖ కూడా చట్టానికి ఇటీవల ఎటువంటి మార్పులు చేయలేదు. కాబట్టి వైరల్ అవుతున్న మెసేజ్ లో చెప్పింది తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll