Fake News, Telugu
 

ఈ వీడియోలో స్పృహ కోల్పోయి పడిపోయినవారు చనిపోలేదు; వాళ్ళు చనిపోయినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు

0

లైవ్ టీవీ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఉన్నట్టుండి కొందరు వ్యక్తులు స్పృహ కోల్పోయి పడిపోయిన ఒక వీడియో కంపైలేషన్‌ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. వీడియోలో స్పృహ కోల్పోయి పడిపోయిన వారు ఉన్నట్టుండి ఆకస్మికంగా చనిపోయారని అర్ధం వచ్చేలా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోలకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: లైవ్ టీవీ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు వ్యక్తులు ఉన్నట్టుండి చనిపోయిన ఘటనల కంపైలేషన్‌.

ఫాక్ట్: వీడియోలో చూపిస్తున్న ఘటనల్లో కేవలం ఒక్క ఘటన మినహాయిస్తే మిగతా అన్ని ఘటనల్లో స్పృహ కోల్పోయి వ్యక్తులు చనిపోలేదు, అందరూ కోలుకున్నారు. వీరు వివిధ కారణాల వల్ల స్పృహ కోల్పోయారు. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు అనే నేపథ్యంలో ఈ వీడియోలో చూపిస్తున్న ఘటనల్లో వ్యక్తులు చనిపోయారంటూ షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియోలో కేవలం ఒక్క ఘటన మినహాయిస్తే మిగతా అన్ని ఘటనల్లో స్పృహ కోల్పోయి వ్యక్తులు చనిపోలేదు. వివిధ కారణాల వల్ల వాళ్ళు కేవలం స్పృహ కోల్పోయారు, ఆ తరవాత కోలుకున్నారు. వైరల్ వీడియోలోని కొన్ని ఘటనలకి సంబంధించిన వివరాలు కింద చూద్దాం.

క్లిప్ 1:

ఈ క్లిప్‌లో  మీడియా సమావేశంలో సడన్‌గా స్పృహ కోల్పోయిన వ్యక్తి కేరళకు చెందిన ప్రముఖ సాంస్కృతిక కార్యకర్త ప్రొఫెసర్ ఎమ్ ఎన్ విజయన్. ఈ ఘటన 2007లో త్రిస్సూర్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది.

మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రొఫెసర్ విజయన్ ఉన్నట్టుండి స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆయనని హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్దారించారు. ఈ ఘటనకి సంబంధించిన సమాచారం ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

క్లిప్ 2:

ఈ క్లిప్‌లోని ఘటన 2013లో జరిగింది. KUTV రిపోర్టర్ బ్రూక్ గ్రాహం రిపోర్టింగ్ మధ్యలో స్పృహ కోల్పోయి పడిపోయింది. ఐతే ఈ ఘటనలో తను చనిపోలేదు. ఘటన తరవాత ఆమె తిరిగి కోలుకుంది. దీనికి సంబంధించిన సమాచారం ఇక్కడ చూడొచ్చు. 

క్లిప్ 3:

ఈ క్లిప్‌లో స్పృహ కోల్పోయి కింద పడిపోయి కనిపిస్తున్నది పాకిస్తాన్ 92 ఛానల్ రిపోర్టర్ ఇర్జా ఖాన్. ఈ ఘటన 2016లో జరిగింది. వేడి వాతావరణం మరియు ఊపిరాడని కారణంగా ఇర్జా ఖాన్ స్పృహతప్పి పడిపోయింది. ఐతే ఆమె తిరిగి కోలుకుంది. ఈ ఘటన తరవాత ఇర్జా ఖాన్ చనిపోయిందన్న వార్త వైరల్ కావడంతో, ఇర్జా ఖాన్ ట్వీట్ ద్వారా తాను క్షేమంగానే ఉన్నానని తెలిపింది.

క్లిప్ 4:

ఈ క్లిప్‌లో స్టేజీపై ఒక అమ్మాయి పాట పాడుతూ సడన్‌గా కింద పడిపోయిన ఘటన 2017లో టర్కీలో జరిగింది. ఐతే ఈ ఘటనలో తను చనిపోలేదు. దీనికి సంబంధించిన సమాచారం ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

క్లిప్ 5:

ఫైటర్ ప్లేన్‌లో ఒక వ్యక్తి స్పృహ కోల్పోయిన ఈ ఘటన 2013లో జరిగింది. సన్‌రైస్ అనే ఆస్ట్రేలియా టీవీ ప్రోగ్రాంలో గ్రాంట్ డెన్యెర్ అనే వ్యక్తి ఇలా స్పృహ కోల్పోయాడు. ఐతే ఈ ఘటనలో అతను చనిపోలేదు. ఈ ఘటన తరవాత తను ట్వీట్ కూడా చేసాడు. ఈ ఘటనకి సంబంధించిన వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.

వైరల్ వీడియోలో చూపిస్తున్న మిగతా ఘటనలో స్పృహ కోల్పోయిన వారు కూడా చనిపోలేదు. వారు తిరిగి కోలుకున్నారు. వీటికి సంబంధించిన ఆధారాలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.  ఐతే మరణం ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు అనే నేపథ్యంలో ఈ వీడియోలో చూపిస్తున్న ఘటనల్లో వ్యక్తులు చనిపోయారంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు

చివరగా, ఈ వీడియోలో స్పృహ కోల్పోయి పడిపోయినవారు చనిపోలేదు, వాళ్ళు చనిపోయినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll