రెండు ఫోటోలతో ఉన్న ఒక కొలేజ్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. దాంట్లో ఉన్న పై ఫోటో మీద ‘భారత్ లోని ముస్లింల మసీద్’ అని, కింది ఫోటో మీద ‘దుబాయ్ లోని హిందూ దేవాలయం’ అని ఉంటుంది. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్దాం.
క్లెయిమ్: కొలేజ్ లోని కింది ఫోటో దుబాయ్ లోని హిందూ దేవాలయానిది.
ఫాక్ట్ (నిజం): కొలేజ్ లోని కింది ఫోటో దుబాయ్ లోని హిందూ దేవాలయానిది కాదు. అది ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ ధామ్ దేవాలయం. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.
కొలేజ్ లోని పై ఫోటోని క్రాప్ చేసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది కాశ్మీర్ కి సంబంధించినదని ఇక్కడ చూడవొచ్చు
కొలేజ్ లోని కింది ఫోటోని క్రాప్ చేసి వెతికినప్పుడు, అది ‘Getty Images’ ఫోటో లైబ్రరీ లో లభించింది. ఆ వెబ్సైటు ద్వారా, ఆ ఫోటో ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ ధామ్ దేవాలయానిదని తెలుస్తుంది. కావున, పోస్టు లో చెప్పినట్లుగా ఆ ఫోటోలో ఉన్నది దుబాయ్ లోని హిందూ దేవాలయం కాదు, అది భారత దేశం లోని హిందూ దేవాలయమే.
చివరగా, ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ ధామ్ ఆలయ చిత్రాన్ని పెట్టి ‘దుబాయ్‌లోని హిందూ దేవాలయం’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?