Fake News, Telugu
 

భారతదేశంలో పురాతన అంతరిక్ష నౌకలు తవ్వకాల్లో బయట పడ్డాయి అని AI- జనరేటెడ్ ఫోటోలు షేర్ చేస్తున్నారు

0

ఇటీవల భారతదేశంలో పురావస్తు శాస్త్రవేత్తలు కొన్ని పురాతన అంతరిక్ష నౌకలను (spaceships) తవ్వకాల్లో కనుగొన్నారు అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక కొల్లాజ్ (ఇక్కడ, ఇక్కడ) షేర్ చేయబడుతోంది. దీన్ని షేర్ చేస్తూ కొందరు యూజర్లు భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలు ఈ అంతరిక్ష నౌకలను ఒక భారతీయ గ్రామంలో కనుగొన్నారని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ చేసిన వెర్షన్‌ను మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారతదేశంలో ఇటీవల జరిగిన పురావస్తు తవ్వకాల్లో ఈ ఫొటోలో కనిపిస్తున్న పురాతన అంతరిక్ష నౌకలు బయట పడ్డాయి.

ఫ్యాక్ట్(నిజం): ఇవి AI- జనరేటెడ్ ఫోటోలు. భారతదేశంలో ఇటీవల జరిగిన పురావస్తు తవ్వకాల్లో ఈ ఫొటోలో కనిపిస్తున్న పురాతన అంతరిక్ష నౌకలు బయట పడ్డాయి అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

వైరల్ క్లెయిమ్ యొక్క వాస్తవికతను వెరిఫై చేయడానికి, భారతదేశంలో ఇటీవల ఏవైనా అంతరిక్ష నౌకలు పురావస్తు తవ్వకాల్లో బయట పడ్డాయా అని తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతికాము. అయితే, ఈ సెర్చ్ ద్వారా మాకు ఒక్క వార్తా కథనం కానీ సైంటిఫిక్ ఆర్టికల్ కానీ దొరకలేదు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా ఇటీవల ఇలాంటి డిస్కవరీ జరిగింది అని చెప్తూ ఎటువంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.

వైరల్ ఫోటోలను సరిగ్గా పరిశీలిస్తే, గతంలో మేము ఫాక్ట్-చెక్ చేసిన కొన్ని పాత ఫోటోలతో (ఇక్కడ, ఇక్కడ) ఈ ఫోటోలకి కొన్ని పోలికలు ఉన్నాయి అని అనిపించింది. ఆ పాత ఫోటోలు అన్ని AI-జనరేటెడ్ ఇమేజెస్. వీటిని పురావస్తు పరిశోధనలలో బయటపడ్డ నిజమైన వస్తువుల ఫోటోలు అని అప్పట్లో తప్పుగా షేర్ చేశారు.  

ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటోలు కూడా AI-జనరేటెడ్ ఇమేజెస్ అయ్యి ఉండవచ్చు అనే అనుమానంతో, ఆ విషయాన్ని వెరిఫై చేయడానికి, ఈ ఫోటోలను మేము హైవ్, సైట్ ఇంజన్ వంటి AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్షన్ టూల్స్ ఉపయోగించి చెక్ చేశాము.

వీటి అనాలసిస్‌లో ఈ ఫోటోలు అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించి తయారు చేసినవి అని మాకు తెలిసింది. ఇవి AI-జనరేటెడ్ ఇమేజెస్ అవడానికి  92.4% అవకాశం ఉంది అని హైవ్ రిపోర్ట్ పేర్కొంది. ఇక సైట్ ఇంజిన్ వీటిని 99% AI-జనరేటెడ్ ఇమేజెస్ అని రిపోర్ట్ ఇచ్చింది.

ఈ గ్రాఫిక్ గురించి వెతుకుతున్న సమయంలో,  వైరల్ ఫోటోలు ఉన్న అక్టోబర్ 2024 నాటి ఒక కథనం మాకు దొరికింది. Online paati అనే వెబ్సైట్ వారు దీన్ని ప్రచురించారు. భారతదేశంలో పురాతన అంతరిక్ష నౌకలు తవ్వకాల్లో బయట పడ్డాయి అనే వార్త ఒక పుకారులా అనిపిస్తుందని ఈ ఆర్టికల్లో Online paati పేర్కొంది .

చివరగా, భారతదేశంలో పురాతన అంతరిక్ష నౌకలు తవ్వకాల్లో బయట పడ్డాయి అని AI- జనరేటెడ్ ఫోటోలు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll