2022 ఒక ప్రత్యేక సంవత్సరం అని, ప్రపంచంలో అందరికీ ఒకే వయసు ఉంటుందని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ అవకాశం 1000 సంవత్సరాలకు ఒకసారే జరుగుతుందని కూడా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 2022 ఒక ప్రత్యేక సంవత్సరం, ప్రపంచంలో అందరికీ ఒకే వయసు ఉంటుంది.
ఫాక్ట్: ప్రస్తుత సంవత్సరం నుండి ఆ వ్యక్తి యొక్క పుట్టిన సంవత్సరాన్ని తీసేస్తే (subtraction చేస్తే) వారి యొక్క వయసు వస్తుంది. వయసు = ప్రస్తుత సంవత్సరం (2022) – పుట్టిన సంవత్సరం. అంటే, వయసు + పుట్టిన సంవత్సరం = 2022. ఇది సహజంగానే వచ్చిన లెక్క, ప్రతి ఏడాదీ జరుగుతుంది. ప్రత్యేకంగా 1,000 సంవత్సరాలకు వచ్చే ఘటన ఏమీ కాదు. ప్రత్యేకంగా 2022లో ప్రపంచంలో అందరికీ ఒకే వయసు ఉంటుందనడంలో అర్థంలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
ఒక వ్యక్తి వయసు ఎలా లెక్కిస్తారు ?
ప్రస్తుత సంవత్సరం నుండి ఆ వ్యక్తి పుట్టిన సంవత్సరాన్ని తీసేస్తే (subtraction చేస్తే) వారి వయసు వస్తుంది. ఉదాహరణకు ఒకరు పుట్టిన సంవత్సరం 1990 అయితే గనక, 2022లో వారి వయసు 32 ఏళ్లుగా లెక్కిస్తారు (2022–1990=32) .
వయసు = ప్రస్తుత సంవత్సరం (2022) – పుట్టిన సంవత్సరం.
అంటే, వయసు + పుట్టిన సంవత్సరం = 2022.
ఇది సహజంగానే వచ్చిన లెక్క, ప్రత్యేకంగా 1,000 సంవత్సరాలకు వచ్చే ఘటన ఏమీ కాదు. అంతే కాదు, ఇది ప్రతి ఏడాదికి వర్తిస్తుంది, కేవలం 2022కి కాదు.
ఇలా రావడం అసాధారణమేమీ కాదు. ఒకవేళ 2021 సంవత్సరాన్ని పరిగణలో తీసుకుంటే, పోయిన సంవత్సరంలో మీ వయసును మీ యొక్క పుట్టిన సంవత్సరానికి కలిపితే 2021 వస్తుంది.
వయసు (పోయిన సంవత్సరంలో మీ వయసు) + పుట్టిన సంవత్సరం = 2021.
ఈ తర్కాన్ని బట్టి 2022లో ప్రపంచంలో అందరికీ ఒకే వయసు ఉంటుందనడంలో అర్థంలేదు. అలాగే, ఏ సంవత్సరం తీసుకున్నా, ఆ సంవత్సరంలో మీ వయసును పుట్టిన సంవత్సరానికి కలిపితే అదే సంవత్సరం వస్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ప్రతి ఏడాది మన వయసు మారుతుంటుంది, ఒకే వయసు ఉండదు.
Factly ఇంతకముందు కూడా తర్కానికి సంబంధించి కొన్ని క్లెయిమ్స్ వచ్చినప్పుడు (ఇక్కడ మరియు ఇక్కడ) ఫాక్ట్-చెక్ చేసింది.
చివరగా, మీ వయసును పుట్టిన సంవత్సరానికి కలిపితే ప్రస్తుత సంవత్సరం వస్తుంది; ఇది ప్రత్యేకంగా 2022లో జరిగే ఘటన ఏమీ కాదు.