Fake News, Telugu
 

డామియన్ డఫీ అనే ఆస్ట్రేలియన్ వన్యప్రాణుల నిపుణుడు తీసిన ఒక వీడియోని, విజయవాడ బుడమేరు కాలువలో మొసళ్ళు అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

మన విజయవాడ లో ఈ రోజు ఉదయం బుడమేరు కాలువలో కనిపెంచిన మొసళ్ళు,’ అని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో మనం రెండు మొసళ్ళు నీళ్లలో ఈదటం చూడవచ్చు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: విజయవాడలోని బుడమేరు కాలువలో మొసళ్ళు తిరుగుతుండగా తీసిన వీడియో.

ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియోను డామియన్ డఫీ అనే ఒక ప్రముఖ ఆస్ట్రేలియన్ వన్యప్రాణుల నిపుణుడు అప్లోడ్ చేశారు. ఇది ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీలో తీసిన వీడియో. కావున, వైరల్ వీడియోలో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కొన్ని కీ  ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ వీడియో యొక్క ఒరిజినల్ పోస్ట్ మాకు దొరికింది.

మొసళ్ళు మరియు రకరకాల అడవి జంతువులకి చెందిన వీడియోలని (ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో(ఇక్కడ, ఇక్కడ) అప్లోడ్ చేసే డామియన్ డఫీ అనే ఒక ఆస్ట్రేలియన్ వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. ఈ వీడియో వివరణలో దీన్ని తను ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీలో తీశారని రాశారు.

డామియన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేస్తే, డామియన్ ఆస్ట్రేలియాలోని ఒక ప్రముఖ వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్, ఫోటోగ్రాఫర్(ఇక్కడ, ఇక్కడ),  టూర్ గైడ్ మరియు క్రొకోడైల్ టూర్ లీడర్ అని మాకు తెలిసింది. ఈయన డిస్కవరీ ఛానల్ వారి టీవీ సిరీస్ ‘లెజెండ్స్ ఆఫ్ ది వైల్డ్’లో కో-హోస్టుగా వ్యవహరించారు(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).

చివరిగా, ఆస్ట్రేలియాలో తీసిన ఒక మొసళ్ల వీడియోని, విజయవాడ బుడమేరు కాలువ మొసళ్ళు కనిపించాయి అని చెప్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll