దక్షిణాఫ్రికా క్రికెటర్ తజ్మిన్ బ్రిట్స్ మోకాలిపై నుంచుని, ఒక కనిపించని విల్లు నుంచి బాణం విసురుతున్నట్లు కనిపిస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీరాముణ్ణి అనుసరిస్తూ తను ఇలా చేసిందని క్లెయిమ్ చేస్తూ, కొందరు యూజర్లు ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం

క్లెయిమ్: దక్షిణాఫ్రికా క్రికెటర్ తజ్మిన్ బ్రిట్స్, శ్రీ రాముడిని అనుసరిస్తూ గాల్లోకి విల్లు విసురుతున్నట్లు ఒక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు చేశారు.
ఫ్యాక్ట్(నిజం): 2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా, న్యూజీలాండ్ జట్టుతో దక్షిణాఫ్రికా ఆడిన మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన తర్వాత దక్షిణాఫ్రికా ప్లేయర్ తజ్మిన్ బ్రిట్స్ ఈ విధంగా చేశారు. ఇది ఫుట్‌బాల్ ఆటగాడు మహమ్మద్ సలా (Mo Salah) ఆటల్లో గోల్స్ చేసినప్పుడు చేసే సెలబ్రేషన్. ఇద్దరు బాలికలో కోరిక మేరకు, సెంచరీ కొట్టిన తర్వాత తను ఈ సెలబ్రేషన్ చేశారని ఆమె చెప్పారు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో తెలుసుకోవడానికి, తెగిన కీవర్డ్స్ ఉపయిగించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను పోలి ఉన్న వీడియో ఒకటి ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) వారి ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మాకు లభించింది.
ఈ వీడియో వివరణలో న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఒక మ్యాచ్‌లో (6 అక్టోబర్ 2025న ప్రపంచ కప్ మ్యాచ్) సెంచరీ కొట్టిన తర్వాత తజ్మిన్ బ్రిట్స్ ఇలా చేశారని ఉంది. ఇదే వీడియో మాకు స్టార్ స్పోర్ట్స్ వారి యుట్యూబ్ ఛానల్లో కూడా లభించింది.
అలాగే, స్పోర్ట్స్‌స్టార్ సంస్థ వారు ఈ మ్యాచ్‌లో తజ్మిన్ బ్రిట్స్ కొట్టిన సెంచరీ తర్వత చేసిన సెలబ్రేషన్ గురించి ప్రచురించిన ఒక కథనంలో, ఇద్దరు 13 ఏళ్ల బాలికల కోరిక మేరకు తాను ఇలా సెలబ్రేట్ చేశారని ఆమె చెప్పారని పేర్కొన్నారు.

ఈ కథనం ప్రకారం తనకి ఒక సిగ్నేచర్ సెలబ్రేషన్ (బ్యాలరీన సెలబ్రేషన్) ఉంది. అయితే వరల్డ్ కప్ మ్యాచ్‌కు ముందు జరిగిన ఒక మీడియా డే సందర్భంగా, తను సెంచరీ చేస్తే ఏ సెలబ్రేషన్ చేస్తారని తన టీమ్ మేట్ సైనాలో జాఫ్తా అడిగితే, తను ఏ సెలబ్రేషన్ చెయ్యాలో అని ఆమెఫ్యాన్స్‌ను కోరుకుంది. ఇద్దరు 13-ఏళ్ల బాలికలు దీన్ని ఎన్నుకున్నారని, అందుకే ఆమె ఈ సెలబ్రేషన్ చేసారాని స్పోర్ట్స్‌స్టార్‌తో కథనంలో ఉంది. దీని గురించి ప్రచురించబడిన మరి కొన్ని వార్తా కథనాలను మీరు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఈ సెలబ్రేషన్‌ను మహమ్మద్ సలా (Mo Salah) సెలబ్రేషన్ అంటారని స్పోర్ట్స్‌స్టార్ కథనంలో పేర్కొన్నారు. దీని గురించి వివరాల కోసం ఇంటర్నెట్‌లో మేము వెతికాము. ఈ సెర్చ్ ద్వారా మహమ్మద్ సలా ఒక ఈజిప్ట్ దేశ ఫుట్‌బాల్ క్రీడాకారుడని, అతను ఈ బౌ అండ్ ఆరో (గాలిలోకి బాణం విసిరినట్లు నటించే) సెలబ్రేషన్‌ను ఫుట్‌బాల్ ఆటల్లో గోల్స్ స్కోర్ చేసినప్పుడు చేస్తాడని చెప్తున్న కొన్ని కథనాలు మాకు దొరికాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). మహమ్మద్ సలా ప్రీమియర్ లీగ్‌లో లివర్‌పూల్ తరుపున ఆడతాడు.

‘Men in Blazers’ అనే యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహమ్మద్ సలా మాట్లాడుతూ, UFC (Ultimate Fighting Championship) ఫైటర్ ఇజ్రాయెల్ అడెసాన్యా ఒక ఫైట్‌లో గలిచిన తర్వాత ఇలా చేయడాన్ని చూసి, అది నచ్చి తను ఈ సెలబ్రేషన్ చేశాడని పేర్కొన్నాడు.
చివరగా, 2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా దక్షిణాఫ్రికా క్రికెటర్ తజ్మిన్ బ్రిట్స్ చేసిన మహ్మద్ మహమ్మద్ సలా సెలబ్రేషన్ వీడియోను, ఆమె శ్రీరాముణ్ణి అనుకరిస్తూ ఇలా చేశారని తప్పుగా షేర్ చేస్తున్నారు.