2024 ఎన్నికల్లో ఫ్రాన్స్‌లోని రైట్‌వింగ్ పార్టీ అయిన ‘నేషనల్ ర్యాలీ’ పార్టీ ఓడిపోయిన తర్వాత, రైట్‌వింగ్ పార్టీ నాయకురాలు మరీన్ లీ పెన్ ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఏడుస్తున్నారు అంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేస్తున్నారు.
క్లెయిమ్: ఫ్రెంచ్ రైట్‌వింగ్ పార్టీ నాయకురాలు మరీన్ లీ పెన్ 2024 ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఏడుస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోను యూరోప్1 యుట్యూబ్ చానెల్ 2021లో “ఇది మార్చి 2017లో, థామస్ సోట్టో యొక్క మార్నింగ్ షోలో జాతీయ ర్యాలీ యొక్క ఆధ్యక్షురాలు మరీన్ లీ పెన్ యొక్క అనుకరణలను, ముఖ్యంగా జీన్-జాక్వెస్ బౌర్డిన్‌ను నికోలస్ కాంటెలోప్ ఇమిటేట్ చేయడం చూసి బాగా నవ్వారు” అని వివరించింది. పలు ఫ్రెంచ్ మీడియా సంస్థలు దీని గిరించి 2017లో ప్రచురించాయి. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియో యొక్క కీ ఫ్రములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేస్తే, ఈ వీడియోను యూరోప్1 యుట్యూబ్ చానెల్ 2021లో “మరీన్ లీ పెన్ నికోలస్ కాంటెలోప్ అనుకరణను చూసి నవ్వుతూ ఏడ్చినప్పుడు (అనువదించబడినది)” అనే టైటిల్ తో ప్రచురించినట్టు గమనించాం. ఈ వీడియో యొక్క వివరణలో “ఇది మార్చి 2017లో, థామస్ సోట్టో యొక్క మార్నింగ్ షోలో నేషనల్ ర్యాలీ యొక్క ఆధ్యక్షురాలు మరీన్ లీ పెన్ యొక్క అనుకరణలను, ముఖ్యంగా జీన్-జాక్వెస్ బౌర్డిన్‌ను నికోలస్ ఇమిటేట్ చేయడం చూసి బాగా నవ్వారు (అనువదించబడినది)” అని వివరించడం గమనించాం.
దీని గురించి తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, ఫ్రెంచ్ మీడియా ఈ దృశ్యాన్ని ప్రచురిస్తూ “మరీన్ లీ పెన్ నికోలస్ కాంటెలోప్ కామెడీకి కన్నీళ్లు వచ్చే వరకు నవ్వింది” అంటూ రాసినట్టు గమనించాం (ఇక్కడ మరియు ఇక్కడ).
చివరిగా, 2017లో తీసిన ఒక షోలో ఫ్రాన్స్ రైట్-వింగ్ నాయకురాలు మరీన్ లీ పెన్ నవ్వుతున్న వీడియోను, 2024 ఫ్రాన్స్ ఎన్నికల్లో తన పార్టీ ఓడిపోయినందుకు ఏడుస్తున్నట్టు షేర్ చేస్తున్నారు.