Fake News, Telugu
 

ఇజ్రాయెల్ దాడుల్లో శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారి దృశ్యాలంటూ సంబంధంలేని సిరియా చిన్నారి దృశ్యాలు తప్పుగా షేర్ చేస్తున్నారు

0

పాలస్తీనాలోని గాజాపై, అలాగే లెబనాన్‌లోని హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలో, “ఇజ్రాయెల్ దాడుల్లో శిథిలాల కింద చిక్కుకున్న ఓ చిన్నారి దృశ్యాలు” అంటూ కొన్ని ఫొటోలతో కూడిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది(ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).  ఈ ఫోటోలలో శిథిలాల క్రింద చిక్కుకున్న ఓ చిన్నారి సహాయం కోసం వేచి ఉన్నట్లు చూపిస్తున్నాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇజ్రాయెల్ దాడుల్లో శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారిని చూపిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఇజ్రాయెల్ దాడుల్లో శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారిని చూపించడంలేదు. వాస్తవానికి ఇవే దృశ్యాలు కలిగిన వీడియోను “userftdvvrl92i” అనే టిక్‌టాక్ (TikTok) యుజర్ 26 అక్టోబర్ 2024న పోస్టు చేశారు. ఇదే చిన్నారికి సంబంధించిన పలు ఇతర వీడియోలను ఈ టిక్‌టాక్ ఖాతా షేర్ చేసింది.  కొన్ని వీడియోలు ఇదే చిన్నారి గోడకు అవతలి వైపున ఉన్న దృశ్యాలను కూడా చూపించాయి, వీటిలో చిన్నారి ఆడుకుంటూ ఉండటం మనం చూడవచ్చు. ఈ వీడియోలలో ఒకదానిలో ఈ చిన్నారి గాజాకి చెందినది కాదని, సిరియాకు చెందినదని స్పష్టం చేశారు. అలాగే ఈ చిన్నారి క్షేమంగా ఉందని స్పష్టం చేశారు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ ఫొటోలకు సంబంధించిన సమాచారం కోసం, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఓరల్ ఫోటోలోని దృశ్యాలను చూపిస్తున్న వీడియోతో కూడిన ఓ X(ట్విట్టర్) పోస్టును (ఆర్కైవ్డ్ లింక్) కన్నుగొన్నాము. ఈ పోస్టులో “ఈ వీడియోలోని దృశ్యాలు శిథిలాల కింద చిక్కుకున్న పాలస్తీనా బిడ్డను చూపించడం లేదని, అదే వ్యక్తి అప్‌లోడ్ చేసిన మరిన్ని వీడియోలు, ఆ చిన్నారి శిథిలాల కింద కాకుండా గోడకు గల రంధ్రం నుంచి బయటికి చూస్తున్నట్లు చూపిస్తుంది” అని పేర్కొన్నారు (ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువదించగా). అలాగే, ఈ పోస్టు క్రింద కామెంట్స్ విభాగంలో ఈ వైరల్ వీడియోకి సంబంధించిన ఆధారాలను (సోర్స్) లింక్‌లను షేర్ చేశారు (ఇక్కడ, & ఇక్కడ).

ఈ సమాచారం ఆధారంగా, ఇవే వైరల్ ఫోటోలోని దృశ్యాలని కలిగిన  వైరల్ వీడియోను “userftdvvrl92i” యుజర్ అనే టిక్‌టాక్(TikTok)లో (ఆర్కైవ్డ్ లింక్)  26 అక్టోబర్ 2024న పోస్టు చేసినట్లు మేము కనుగొన్నాము. అలాగే మేము ఈ టిక్‌టాక్ అకౌంట్లో ఇదే చిన్నారికి సంబంధించిన పలు వీడియోలను కనుగొన్నాము, ఈ వీడియోలు చిన్నారి గోడకు ఉన్న రంధ్రం నుండి బయటికి చూస్తున్నట్లు చూపిస్తుంది. కొన్ని వీడియోలు ఇదే చిన్నారి గోడకు అవతలి వైపున ఉన్న దృశ్యాలను కూడా చూపించాయి, వీటిలో చిన్నారి ఆడుకుంటూ ఉండటం మనం చూడవచ్చు (ఇక్కడ మరియు ఇక్కడ).

ఈ వీడియోలలో ఒకదానిలో ఈ చిన్నారి గాజాకి చెందినది కాదని, సిరియాకు చెందినదని స్పష్టం చేయబడింది (ఆర్కైవ్డ్ లింక్). ఈ వైరల్ దృశ్యాలు చూపిస్తున్న చిన్నారి క్షేమంగా ఉందని స్పష్టం చేశారు. అలాగే తప్పుడు క్లెయిమ్‌లతో ఈ చిన్నారి వీడియోలను షేర్ చేయవద్దని కూడా కోరారు.

చివరగా, ఇజ్రాయెల్ దాడుల్లో శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారి దృశ్యాలంటూ సంబంధంలేని సిరియా చిన్నారి దృశ్యాలు తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll