Fake News, Telugu
 

2021లో అప్పటి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సభను రైతులు ధ్వంసం చేస్తున్న వీడియోను 2024 లోక్‌సభ ఎన్నికలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

0

2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రచార సభ వేదికను ధ్వంసం చేస్తున్న ప్రజలు అని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ప్రచారం అవుతోంది. ఈ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం. 

క్లెయిమ్: 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో హర్యానా ముఖ్య మంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రచార సభ వేదికను ప్రజలు ధ్వంసం చేస్తున్న వీడియో.

ఫాక్ట్: ఈ వీడియోలోని సంఘటన నయాబ్ సింగ్ సైనీ 2024 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో జరగలేదు. ఈ సంఘటన 2021లో హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లా దగ్గర ఉన్న కైమ్లా అనే గ్రామంలో చోటు చేసుకుంది. కేంద్రం 2021లో ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ చట్టాల ప్రయోజనాలను గురించి అప్పటి హర్యానా ముఖ్య మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రజలను ఉద్దేశించి “కిసాన్ మహా పంచాయత్” కార్యక్రమంలో ప్రసగించాల్సి ఉంది. కానీ, ఆ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకరిస్తున్న రైతులు ఆ వేదికను ధ్వంసం చేసారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 

వైరల్ వీడియోకి సంబంధించిన కీ ఫ్రేమ్స్ ని గూగుల్ లో  రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే ఇదే విజువల్స్ తో ఎక్కువ నిడివితో ఉన్న ఒక వీడియో లభించింది. 10 జనవరి 2021న ప్రచురించిన ఈ వీడియోలో 1:45 టైం స్టాంప్ దగ్గర వైరల్ వీడియోలో ఉన్న విజువల్స్ ని చూడవచ్చు. అంతేకాక, వీడియోలో ఈ సంఘటనను వివరిస్తున్న వ్యక్తి హర్యానా ముఖ్యమంత్రి వేదికను రైతులు ధ్వంసం చేస్తున్నారని వివరించాడు.

పైన లభించిన సమాచారాన్ని ఉపయోగించి ఇంటర్నెట్ లో వెతికితే ఈ సంఘటనకు సంబంధించి పలు వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) లభించాయి.  వీటి ప్రకారం, ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లా దగ్గర ఉన్న కైమ్లా అనే గ్రామంలో చోటు చేసుకుంది. 2021లో కేంద్రం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ చట్టాల ప్రయోజనాలను గురించి అప్పటి హర్యానా ముఖ్య మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రజలను ఉద్దేశించి “కిసాన్ మహా పంచాయత్” కార్యక్రమంలో ప్రసగించాల్సి ఉంది. కానీ, ఆ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకరిస్తున్న రైతులు ఆ వేదికను  ధ్వంసం చేసారు. దీనితో, మనోహర్ లాల్ ఖట్టర్ ఆ కార్యక్రమాన్ని  రద్దు చేసారు.

వైరల్ వీడియో విజువల్స్ ని, 2021లో ఈ సంఘటనను ప్రచురించిన వార్తా కథనాల్లోని ఫోటోలను కింద గమనించవచ్చు. వీటిని బట్టి, వైరల్ వీడియోలోని సంఘటన 2021లో జరిగినట్టు చెప్పవచ్చు. 

చివరగా, 2021లో అప్పటి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్ సభను రైతులు ధ్వంసం చేస్తున్న వీడియోను 2024 లోక్‌సభ ఎన్నికలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll