Fake News, Telugu
 

చేతిలో నుంచి ఫోన్ లాక్కుందని ఒక పిల్లవాడు తన తిల్లిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన నిజమైన వీడియో అని ఒక స్క్రిప్టెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు.

0

ఒక స్కూలు పిల్లవాడు తన తల్లిని క్రికెట్ బ్యాట్‌తో కొడుతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “… అందరూ ఒక్కసారి ఈ వీడియో చూస్తే పిల్లలు ఆండ్రాయిడ్ కి ఎంత అడిక్ట్ అయ్యారో ఎంత ప్రమాదకరం జరిగింది చూడండి తల్లి తండ్రులు జాగ్రత్తగా వుండండి ఇలాంటి పిల్లలు దగ్గర.,” అని క్లెయిమ్ చేస్తూ ఈ వీడియోని నెటిజన్లు షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ వీడియో యొక్క ఆర్చైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: ఒక స్కూల్ పిల్లవాడు, తన తల్లి తనను మొబైల్ ఫోన్ వాడనివ్వలేదు అని ఆమెను క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన నిజమైన సంఘటనని చూపిస్తున్న వీడియో.

ఫ్యాక్ట్(నిజం): ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, దీన్ని ఐడియాస్ ఫ్యాక్టరీ అనే ఫేస్‌బుక్ పేజీ వారు తయారు చేశారు. వీళ్లు ప్రజలకు అవగాహన తీసుకురావడం కోసం స్క్రిప్టెడ్ వీడియోలు తయారు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో కూడా కేవలం వినోదం కోసం రూపొందించిన వీడియో అని అసలు వీడియోలో ఒక వివరణ ఉంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ వీడియోను వెరిఫై చేస్తున్న క్రమంలో ఇదే వీడియోతో ఉన్న మరో పోస్ట్ మాకు ఫేస్‌బుక్‌లో దొరికింది(ఆర్కైవ్డ్ పోస్ట్). ఈ వీడియో వివరణలో, ‘Watch more original videos by: Sanjjanaa Galrani’ అని ఉంది. 

Sanjjnaa Galrani ఒక నటి, ఈమె తన ఫేస్‌బుక్‌ పేజీలో వైరల్ వీడియో ఫార్మాట్‌లో ఉన్న స్క్రిప్టెడ్ వీడియోలని అప్లోడ్ చేస్తారు (ఇక్కడ, ఇక్కడ). కొన్ని సార్లు, ఈ వీడియోలను ‘ఐడియాస్ ఫ్యాక్టరీ’ అనే పేజీతో కలిసి అప్లోడ్ చేస్తారు. ‘ఐడియాస్ ఫ్యాక్టరీ’ వారు కూడా ప్రజలకు అవగాహన కలిగించడానికి తయారు చేసిన స్క్రిప్టెడ్ వీడియోలను అప్లోడ్ చేస్తుంటారు.  గతంలో Sanjjanaa Galrani అప్లోడ్ చేసిన స్క్రిప్టెడ్ వీడియోలు, నిజమైన సంఘటనకి చెందిన వీడియోలు అని వైరల్ అయితే మేము వాటిని తప్పు అని చెప్తూ ఆర్టికల్ రాసాము

వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా వీళ్లు తయారు చేసిన స్క్రిప్టెడ్ వీడియో అయి ఉండవచ్చు అనే అనుమానంతో తన పేజీలో వెతకగా ఈ వీడియో తన పేజీలో దొరకలేదు, కానీ ‘ఐడియాస్ ఫ్యాక్టరీ’  పేజిలో మాకు దొరికింది( ఆర్కైవ్డ్ వెర్షన్). ఈ వీడియోను ఇప్పుడు వాళ్లు డిలీట్ చేశారు.

ఈ వీడియోలో కనిపిస్తున్న లోకెషన్‌లో వీళ్లు మరో స్క్రిప్టెడ్ వీడియోని(ఆర్కైవ్డ్ వెర్షన్) కూడా చేసి వాళ్ల పేజీలో అప్లోడ్ చేశారు. అందులో కనిస్తున్న టీవీ, ట్రెడ్‌మిల్, షెల్ఫ్, గోడ పైన ఉన్న పెయింటింగ్, అన్ని కూడా వైరల్ వీడియోలో కూడా ఉన్నాయి.

వైరల్ అవుతున్న వీడియో స్క్రిప్టెడ్ అని చెప్పి D-intent Data వాళ్ళు, ఈ వీడియోని కేవలం వినోదం కోసమే తయారు చేశారు అని చెప్పి ఉన్న వివరణ ఉన్న ‘ఐడియాస్ ఫ్యాక్టరీ’ వాళ్ల అసలు పోస్ట్ యొక్క స్క్రీన్‌షాట్ ‘X’లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఫేక్ అని చెప్పి తమిళ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్వర్క్ ‘Admin Media’ వారు కూడా ఒక ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్ ప్రచురించారు. ఈ వీడియోపై మరింత సమాచారం కోసం ‘ఐడియాస్ ఫ్యాక్టరీ’ని మేము సంప్రదించాము, వాళ్ల సమాధానం రాగానే ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

చివరిగా, ఒక మహిళని ఒక పిల్లవాడు క్రికెట్ బ్యాట్ తీసుకొని కొడుతున్న స్క్రిప్టెడ్ వీడియోని, నిజమైన సంఘటనకి చెందిన వీడియో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll