‘కన్న కూతురు ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంటే వెళ్ళొద్దని ప్రాధేయ పడుతున్న తండ్రి.’ అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక పెద్ద వయసు వ్యక్తి ఒక జంటను వెంబడిస్తూ, వాళ్ల కాళ్ల మీద పడటం మనం చూడవచ్చు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: కన్న కూతురు, ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంటే వెళ్ళొద్దని తన తండ్రి ప్రాధేయ పడుతున్న సంఘటనకకి చెందిన వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, దీన్ని సాయి విజయ్ అనే తమిళ ఫిల్మ్‌మేకర్ (డైరెక్టర్) తీసి, తన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేశాడు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు వెరిఫై చేస్తున్న సమయంలో, ఈ వీడియో పైన ‘Sai Vijay’ అనే పేరుతో ఒక లోగో ఉండటం మేము గమనించాము. ఆ తర్వాత, వైరల్ వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి, ‘Sai Vijay’ అనే కీ వర్డ్ దానికి జోడించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాము.

ఈ సెర్చ్ ద్వారా వైరల్ వీడియోలోని దృశ్యాలను పోలి ఉన్న ఒక యూట్యూబ్ షార్ట్స్ వీడియో మాకు లభించింది. ‘SAI VIJAY’ అనే ఛానల్‌లో ఈ వీడియోని ‘పాపం నాన్న🥹| Running couple | Saivijay|,’(తమిళ పదాలని తెలుగులోకి అనువదించినప్పుడు) అనే టైటిల్‌తో 20 మార్చ్ 2025న అప్లోడ్ చేశారు.
‘SAI VIJAY’ ఛానల్‌లో వైరల్ వీడియో యొక్క పూర్తి వెర్షన్ (ఆర్కైవ్ లింక్) కూడా ఉంది, దాన్ని వారు 19 మార్చి 2025న అప్లోడ్ చేశారు. ఈ వీడియో యొక్క తమిళ టైటిల్, ‘నాన్న కిందపడి ఏడ్చాడు | మానం లేని అమ్మాయి | Part -7 | Running couple | Saivijay.’ వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో 10:16 సెకన్ల దగ్గర నుంచి మనం చూడవచ్చు.
అయితే ఈ వీడియో నిజమైన సంఘటనది కాదు అని, ఈ వీడియో యొక్క వివరణలో, వీడియోలో 0:52 మార్క్ దగ్గర ఉన్న వివరణ చూడగా మాకు తెలిసింది. ఈ ఛానల్‌లో స్క్రిప్టెడ్ ప్రాంక్ వీడియోలు ఉంటాయి అని, ఈ వీడియోలని కేవలం వినోదం కోసం(Entertainment purposes) తయారు చేసినవి అని ఇందులో చెప్పారు.

అలాగే, ఈ యాట్యూబ్ ఛానల్ యొక్క ‘About’ సెక్షన్లో, తను వృత్తి రీత్యా ఒక డైరెక్టర్ అని ‘Sai Vijay’ పేర్కొన్నారు. తన ఛానల్‌లో ఇటువంటి స్క్రిప్టెడ్ వీడియోలు చాలా ఉన్నాయి. వాటిని మీరు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, తమిళ ఫిల్మ్‌మేకర్ ‘Sai Vijay’ తయారు చేసిన ఒక స్క్రిప్టెడ్ వీడియోని, ఒక తండ్రి తన కూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోతున్నప్పుడు, వెళ్లొద్దు అని ప్రాధేయ పడుతున్న నిజమైన సంఘటనకి చెందిన వీడియో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.