Fake News, Telugu
 

రైల్వే స్టేషన్‌లో ఒక మహిళ హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి ఒక వ్యక్తి ఫోన్ దొంగిలిస్తున్న వీడియో అని చెప్తూ ఒక స్క్రిప్టెడ్ వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఒక మహిళ రైలు ఎక్కుతుండగా తన బ్యాగులో నుంచి ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగిలిస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ‘సైలెంట్ గా వచ్చి మొబైల్ కొట్టేసిన దొంగ’ అని చెప్తూ ఈ వీడియో షేర్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రైల్వే స్టేషన్ స్టేషన్‌లో ఒక మహిళ హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగిలిస్తున్న వీడియో.

ఫ్యాక్ట్ (నిజం): ఇది వినోదం కోసం తయారు చేసిన ఒక స్క్రిప్టెడ్ వీడియో. దీన్ని ‘arti_01’ అనే సోషల్ మీడియా వీడియో క్రియేటర్ తయారు చేశారు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ వీడియో యొక్క అసలు వెర్షన్ మాకు ‘hey arti_01’ అనే ఫేస్‌బుక్‌ పేజీలోమాకు లభించింది. ఈ వీడియోను తను 20 సెప్టెంబర్ 2025న అప్లోడ్ చేశారు.

తన ఫేస్‌బుక్‌ పేజీ ఇంట్రోలో తాను ఒక రీల్ క్రియేటర్ (Reel Creator) అని, వినోదం కోసం తాను, తన భర్త ఆమె పేజీలో ఉన్న వీడియోలు చేస్తారని ‘arti_01’ పేర్కొన్నారు. అంటే, వైరల్ వీడియో నిజమైన సంఘటన కాదని మనకు దీనిబట్టి స్పష్టం అవుతుంది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కూడా ఆమె ‘Reel Creator’ అని పేర్కొన్నారు. 

ఈమె సోషల్ మీడియా పేజీలలో రైల్వే స్టేషన్‌లలో ‘మొబైల్ దొంగతనం’ ‘డబ్బు దొంగతనం’ వీడియోలు చాలా ఉన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఒక వీడియోలో అయితే, వైరల్ వీడియోలో కనిపిస్తున్న మహిళ, ఒక వ్యక్తి మొబైల్ దొంగిలిస్తున్న సన్నివేశం ఉంది. 

చివరగా, రైల్వే స్టేషన్ స్టేషన్‌లో ఒక మహిళ హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి ఒక వ్యక్తి ఫోన్ దొంగిలిస్తున్న వీడియో అని చెప్తూ ఒక స్క్రిప్టెడ్ వీడియోను షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll