Fake News, Telugu
 

దసరా ఉత్సవాలలో భాగంగా మైసూరులో గత కొన్నేళ్లుగా ఏర్పాటు చేస్తున్న లైటింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసినగా షేర్ చేస్తున్నారు

0

చారిత్రక మైసూరు దసరా ఉత్సవాలలో దుర్గమ్మకు బదులు దర్గాను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం”, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. దర్గాను ప్రతిబింబించేలా కట్టిన ఒక పండాల్‌కు పచ్చ రంగు కాంతులతో అలంకరణ చేసిన దృశ్యాన్ని మనం ఈ ఫోటోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రక మైసూరు దసరా ఉత్సవాలలో దుర్గమ్మకు బదులు దర్గా పండాల్‌ల లైటింగ్ ఏర్పాటు చేసిన దాని ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ లైటింగ్ దసరా ఉత్సవాలలో భాగంగా మైసూరు నగరం సయ్యాజి రోడ్డులో గత కొన్నేళ్లుగా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. గత బీజేపీ ప్రభుత్వం సమయంలో జరిగిన దసరా ఉత్సవాలలో కూడా ఈ పండాల్‌ను ఇదేవిధంగా పచ్చ రంగు దీపాలతో అలంకరించారు. ఈ పండాల్‌ను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియోని ఒక యూట్యూబ్ యూసర్ 16 అక్టోబర్ 2023 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 2023 మైసూరు దసరా దీపాలంకరణ దృశ్యాలంటూ ఈ వీడియోని షేర్ చేస్తూ తెలిపారు. దసరా పండగ సందర్భంగా మైసూరు నగరాన్ని దీపాలతో అలంకరించిన దృశ్యాలంటూ ఈ వీడియోని షేర్ చేస్తూ ఆ యూట్యూబ్ యూసర్ చేశారు. ఇదే ఫోటోని హిందూస్తాన్ టైమ్స్ వార్తా సంస్థ 16 అక్టోబర్ 2023 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో షేర్ చేశారు.

అయితే, గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దసరా ఉత్సవాలలో కూడా వీడియోలో కనిపిస్తున్న అదే పండాల్‌ను ఏర్పాటు చేశారని తెలిసింది. మైసూరు నగరం సయ్యాజి రోడ్డులో దసరా పండగ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ పండాల్‌ను ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. 2019, 2020 మరియు 2022లో జరిగిన దసరా ఉత్సవాలకు సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

దసరా పండగ ఉత్సవాలలో భాగంగా చాముండేశ్వరి ఎలక్ట్రిసిటీ సప్లై కార్పొరేషన్ (CESC) ప్రస్తుతం మైసూరు నగరంలో దుర్గా మాత పండాల్‌లను, దేవాలయాలను, వీధులను మరియు జంక్షన్లను కాంతులతో అలంకరించారు. పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్న పండాల్‌ను కర్ణాటకలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసినది కాదని పై వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, మైసూరు దసరా ఉత్సవాలలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్న పండాల్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిందని తప్పుగా షేర్ చేస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll