సాక్షి ఛానల్ పబ్లిష్ చేసిన ఒక న్యూస్ బులిటెన్ ని షేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ, కృష్ణ, ప్రకాశం జిల్లాలో 31 మార్చి వరకు మళ్ళీ లాక్ డౌన్ విధించినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. మరొక పోస్టులో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26 మర్చి 2021 నుండి విజయవాడ నగరంలో పూర్తి లాక్ డౌన్ విధించబోతుందని ‘NTV’ ఛానల్ రిపోర్ట్ చేసినట్టుగా క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: విశాఖ, కృష్ణ, ప్రకాశం జిల్లాలలో మళ్ళీ లాక్ డౌన్ విధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఫాక్ట్ (నిజం): పోస్టులలో షేర్ చేసిన వీడియోలు పాతవి. విశాఖ, కృష్ణ, ప్రకాశం జిల్లాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ లాక్ డౌన్ విధించిందనట్టు షేర్ చేసిన ఈ సాక్షి న్యూస్ బులిటెన్ 23 మార్చి 2020 నాడు పబ్లిష్ చేసారు. అలాగే, విజయవాడ నగరంలో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తునట్టుగా షేర్ చేసిన వీడియోని NTV ఛానల్ 23 జూన్ 2020 నాడు పబ్లిష్ చేసారు. ఈ వీడియోలు 2020లో విధించిన లాక్ డౌన్ కి సంబంధించినవి. కావున, ఈ పోస్టులలో చేస్తున్న క్లెయిమ్లు తప్పు.
వీడియో-1:
పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో కోసం గూగుల్ లో వెతికితే, ఇవే దృశ్యాలతో ఉన్న వీడియోని సాక్షి న్యూస్ ఛానల్ 23 మార్చి 2020 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. కరోనా వైరస్ కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో, దేశంలోని 80 జిల్లాలలో 31 మార్చి 2020 వరకు లాక్ డౌన్ విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశం ఇచ్చినట్టు ఈ న్యూస్ రిపోర్ట్ లో తెలిపారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ, కృష్ణ, ప్రకాశం జిల్లాలలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించినట్టు సాక్షి న్యూస్ ఛానల్ రిపోర్ట్ చేసింది. ఇదే విషయాన్నీ తెలుపుతూ ‘AP24x7’ ఛానల్ పబ్లిష్ చేసిన వీడియోని ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో 2020లో విధించిన లాక్ డౌన్ కి సంబంధించిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
వీడియో-2:
పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో కోసం ‘NTV’ యూట్యూబ్ ఛానెల్లో వెతికితే, ఈ వీడియోని 23 జూన్ 2020 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. విజయవాడ నగరంలో కరోనా కేసులు మళ్ళీ పెరగడంతో కృష్ణ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ నగరంలో 26 జూన్ 2020 నుండి వారం రోజులు పూర్తి లాక్ డౌన్ విధించినట్టు ‘NTV’ ఛానల్ ఈ వీడియోలో రిపోర్ట్ చేసింది. జూన్ 2020లో విజయవాడ నగరంలో విధించిన ఈ లాక్ డౌన్ గురించి సమాచారం తెలుపుతూ పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్స్ ని, వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, 2020లో పబ్లిష్ చేసిన న్యూస్ వీడియోలని చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ, కృష్ణ, ప్రకాశం జిల్లాలలో మళ్ళీ లాక్ డౌన్ విధించినట్టుగా షేర్ చేస్తున్నారు.