ఫేస్బుక్ లో ఒక ఫోటో ని పెట్టి, అది చైనా లో కొరోనా వైరస్ బారిన పాడిన బాధితులదని చెప్తున్నారు. అందులో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: చైనా లో కొరోనా వైరస్ బారిన పాడిన బాధితుల ఫోటో.
ఫాక్ట్ (నిజం): కాట్జ్‌బాచ్ నాజీ నిర్బంధ శిబిర బాధితులను స్మరించుకుంటూ, ఫ్రాంక్ ఫుర్ట్ (జర్మనీ) లో చేపట్టిన ఒక ‘ఆర్ట్ ప్రాజెక్ట్’ లో భాగంగా, కొంతమంది వ్యక్తులు రోడ్డుపై పడుకున్నప్పటి ఫోటో. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టులో బ్రహ్మం (పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి) గారు చెప్పినట్లుగా ఉన్న పద్యం ఒకటి ఉంది. ఆ పద్యంలో బ్రహ్మం గారు కొరోనా వైరస్ గురించి ముందే తెలిపారని చెప్తూ, అనేక వార్తా పత్రికలు కథనాలను ప్రచురించారు. ఆ పద్యాన్ని క్రింద చదవవచ్చు-
‘ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను
లక్షలాది ప్రజలు సచ్చేరయ
కోరంకియను జబ్బు కోటిమందికి తగిలి
కోడిలాగా తూగి సచ్చేరయ’.
పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ‘South China Morning Post’ వార్తా సంస్థ యొక్క కథనం లో లభించింది. దానిని 2014 లో ప్రచురించినట్లుగా ఉంది మరియు అందులోని ఫోటోకి క్రెడిట్స్ ‘Reuters’ సంస్థ అని ఉంది. ‘Reuters’ వెబ్సైటు లో ఆ ఫోటో గురించి వెతికినప్పుడు అది లభించింది. ఆ ఫోటో గురించి ఉన్న వివరణ ద్వారా, అది కాట్జ్‌బాచ్ నాజీ నిర్బంధ శిబిర బాధితులను స్మరించుకుంటూ, ఫ్రాంక్ ఫుర్ట్ (జర్మనీ) లో చేపట్టిన ఒక ‘ఆర్ట్ ప్రాజెక్ట్’ లో భాగంగా, కొంతమంది వ్యక్తులు రోడ్డుపై పడుకున్నప్పుడు తీసిన ఫోటో అని తెలిసింది.
చివరగా, పోస్టులోని ఇమేజ్ చైనా లో కొరోనా వైరస్ బారిన పడిన బాధితులది కాదు మరియు అక్కడ ఉన్నది శవాలు కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?