Update (02 July 2022)
మహారాష్ట్ర కూడా ఏప్రిల్ 2022 నుండి ‘బ్లడ్ ఆన్ కాల్’ సేవలు ఆపేసింది. ఆర్థికంగా ఆచరణీయం కాదు అని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిపోర్ట్స్ ఉన్నాయి.
భారత ప్రభుత్వం ‘బ్లడ్ ఆన్ కాల్’ అనే సేవను కొత్తగా ప్రారంభించింది అని, భారత దేశమంతటా ‘104’ హెల్ప్ లైన్ నెంబర్ ని ప్రత్యేక సంఖ్యగా రక్త అవసరాలకై వాడొచ్చు అంటూ ఒక పోస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా లో షేర్ చేయబడుతుంది. ఈ పోస్ట్ లో ఎంత నిజం ఉందో కనుక్కుందాం.
క్లెయిమ్ : ‘104’ హెల్ప్ లైన్ నెంబర్ ని ‘బ్లడ్ ఆన్ కాల్’ సేవకి భారత దేశమంతటా ప్రారంభించారు.
ఫాక్ట్ (నిజం): ‘104’ హెల్ప్ లైన్ నెంబర్ ని ‘బ్లడ్ ఆన్ కాల్’ సేవకై మహారాష్త్రలో మాత్రమే ప్రారంభించారు. ఈ సేవ మొత్తం భారత దేశానికి కాదు. వేరే రాష్ట్రాలు ఈ 104 హెల్ప్ లైన్ నెంబర్ ని ఇతర సేవలు అందించడానికి వాడుతున్నారు. కావున, పోస్ట్ లో చెప్పినట్టు దేశమంతటా వర్తిస్తుందనేది తప్పు.
‘బ్లడ్ ఆన్ కాల్ ‘ (104) సేవ గురించి గూగుల్ లో వెతికితే ఇది 2014 జనవరి లో మహారాష్ట్ర లో ప్రారంభించారని తెలుస్తుంది. ఈ సేవ గురించి పోస్టులో చెప్పిన వివరాలన్నీ ‘Times of India’ 2014 లో ప్రచురించిన ఆర్టికల్ లో చూడవచ్చు. మహారాష్ట్ర పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వెబ్సైటు లో కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్ ని చూడవచ్చు. కానీ, వేరే రాష్ట్రాలల్లో ‘104’ హెల్ప్ లైన్ నెంబర్ ని ఇతర సేవలకై ఉపయోగిస్తున్నారు (మహారాష్ట్రలో కూడా ‘104’ని వేరే సేవలకై ఉపయోగిస్తున్నారు). అంతేకాక, ‘బ్లడ్ ఆన్ కాల్’ సేవను భారత దేశమంతటా అమలు చేయలేదు.
104 హెల్ప్ లైన్ నెంబర్ గురించి మరింత వెతకగా GVK EMRI ఇతర రాష్ట్రాల (తమిళనాడు, గుజరాత్,గోవా, రాజస్థాన్, డామన్ & డియూ, దాద్రా & నగర్ హవేలీ) భాగస్వామ్యంతో నడుపుతున్న ‘104 హెల్ప్ లైన్ హెల్త్ ఎడ్వైస్ సర్వీసెస్’ గురించి వివరాలు లభించాయి.
కొన్ని రాష్ట్రాల్లో ‘104’ హెల్ప్ లైన్:
తెలంగాణ:
104 – వైద్య సేవలు, ఆరోగ్య శాఖ డైరెక్టర్ మరియు కమీషనర్ నియంత్రణలో ఉన్నాయి. ఈ సేవలు రూరల్ హెల్త్ సర్వీసెస్ కి వర్తిస్తాయి.
అస్సాం:
104 సారథి, 24-గంటలు ఉచిత సేవలు అందచేసే హెల్త్ కాంటాక్ట్ సెంటర్. ఇది నాలుగు కీలకమైన వైద్య సేవలను అందచేస్తుంది: ట్రయాజ్, కౌన్సెలింగ్, డైరెక్టరీ సమాచారం, మరియు కంప్లైంట్ రిజిస్ట్రేషన్.
రాజస్థాన్:
‘104’ టోల్-ఫ్రీ నెంబర్ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది.
చివరగా, మహారాష్ట్రకి సంబంధించిన ‘బ్లడ్ ఆన్ కాల్’ (104) అనే సేవ భారత దేశానికి మొత్తం లేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: ‘బ్లడ్ ఆన్ కాల్’ (104) సేవ మహారాష్ట్ర లో మాత్రమే ఉంది, దేశమంతటా కాదు - Fact Checking Tools | Factbase.us