Fake News, Telugu
 

‘Gram Vikas Rozgar Yojana’ పేరుతో ఎటువంటి ప్రభుత్వ పథకం లేదు

0

ఒక ఉత్తరం ఫోటోని FACTLY కి వాట్స్ఆప్ లో పంపించి, అది ఫేక్ గా కనిపిస్తుందని దానిలో ఎంత నిజముందో కనుక్కోమని కొందరు అడిగారు. ధరఖాస్తు చేసుకుంటే ఊరికి ముగ్గురిని  ‘Village Service Representatives’ గా ‘Gram Vikas Rozgar Yojana’ పథకం కింద నియమిస్తామని ఉత్తరం లో ఉంటుంది. ఆ ఉత్తరంలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

క్లెయిమ్ (దావా): ‘Gram Vikas Rozgar Yojana’ పథకం కింద ఊరిలో చదువుకొని ఉన్న అబ్బాయిలకు ‘Village Service Representatives’ గా ఉద్యోగాలు. 

ఫాక్ట్ (నిజం): ‘Gram Vikas Rozgar Yojana’ పేరుతో ఎటువంటి పథకం లేదు. ఒకవేళ ప్రభుత్వం అధికారికంగా ఏదైనా పథకం కింద నియామకాలు చేయాలనుకున్నా ప్రైవేటు సంస్థల పేర్లపై డీడీ (డిమాండ్ డ్రాఫ్ట్) లను పంపమని అడగదు. అంతే కాదు, మేఘాలయ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఉత్తరమే వైరల్ అయినప్పుడు ‘South West Khasi Hills’ జిల్లా అధికారులు ఆ ఉత్తరం ఫేక్ అని ఒక గమనికను రిలీజ్ చేసారు. కావున ‘Gram Vikas Rozgar Yojana’ పేరుతో వస్తున్న ఉత్తరంలో ఎటువంటి నిజం లేదు.     

‘Gram Vikas Rozgar Yojana’ అనే పేరుతో ఏమైనా పథకం ఉందా అని గూగుల్ లో వెతకగా, ఆ పేరుతో ఎటువంటి ప్రభుత్వ పథకం లేదని తెలుస్తుంది. ఉత్తరం లో చూస్తే, ఆసక్తి ఉన్నవారు 1200 రుపాయుల డీడీ ని ‘Kanak Enterprises, payable at Delhi’  పేరు మీద పంపమని ఉంటుంది. ప్రభుత్వం ఎప్పుడు కూడా అధికారిక నియామకాలకు ప్రైవేటు సంస్థల పేర్లపై డీడీ లను పంపమని అడగదు. అంతేకాదు, ఉత్తరంలో కుడా చాలా వ్యాకరణ మరియు స్పెల్లింగ్ తప్పులు ఉన్నట్టుగా చూడవచ్చు. ప్రభుత్వం విడుదల చేసే అధికారిక నోటిఫికేషన్లలో అటువంటి తప్పులు ఉండవు. పథకం పేరు కూడా పలు చోట్ల వివిధ రకాలుగా రాసినట్టు ఉత్తరంలో చూడవచ్చు. ఉత్తరంలోని మరికొన్ని తప్పులను కింద ఫోటోలో చూడవచ్చు.

‘Gram Vikas Rozgar Yojana’ పై మరికొంత సమాచారం కోసం Gram Vikas Rozgar Yojana Kanak Enterprises’ అని గూగుల్ లో వెతకగా, మార్చి 2019 లో మేఘాలయ రాష్ట్రంలో ఇలాంటి ఉత్తరమే వైరల్ అయినప్పుడు ‘South West Khasi Hills’ జిల్లా అధికారులు ఉత్తరం ఫేక్ అని చెప్తూ ఒక గమనికను వాళ్ళ అధికారిక వెబ్ సైట్ లో పెట్టినట్టు చూడవచ్చు.

అంతేకాదు, ఇలాంటి ఉత్తరమే పంజాబ్ రాష్ట్రంలో కూడా ప్రచారంలో ఉన్నట్టు దైనిక్ భాస్కర్ ఆర్టికల్ లో చూడవచ్చు. ఆ ఆర్టికల్ ప్రకారం పంజాబ్ లోని ఒక ఊరిలో ఉత్తరాన్ని చూసి ఇరవై మంది యువకులు ఉద్యోగం వస్తుందనే ఆశతో ‘Kanak Enterprises’ కి పన్నెండు వందల రుపాయుల డీడీలు పంపించారు. ఆ సంస్థ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో వాళ్ళు పంచాయతి డిపార్టుమెంటు ఆఫీసు వారిని ఆ పథకం గురించి అడగగా, వారు అటువంటి పేరుతో ఎటువంటి పథకాన్ని అసలు ప్రభుత్వం మొదలు పెట్టలేదని చెప్పారు.

చివరగా, ‘Gram Vikas Rozgar Yojana’ పేరుతో ఎటువంటి ప్రభుత్వ పథకం లేదు. ‘Kanak Enterprises’ కి డీడీ లు పంపించకండి.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll