Fake News, Telugu
 

ఇస్లాంకు ఐరోపా మధ్య కంపాటబిలిటీ సమస్యలున్నాయని జార్జియా మెలోని 2018లో చేసిన వ్యాఖ్యలను ఇటీవల చేసినవిగా చేస్తున్నారు

0

Update (28 December 2023):

అల్లా కానుక అంటూ పదేసి మందిని కనే వాళ్ళు,వారి పోషణకయ్యే ఖర్చును ఆ అల్లా నుండే పొందాలి. ప్రజల టాక్సుల నుండి ఇవ్వం” అని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని చెప్పినట్లుగా ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ముందుగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇటీవల ఇటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేశారా అని ఇంటర్నెట్లో వెతకగా మాకు ఎటువంటి సమాచారం లభించలేదు. ఇటలీ పార్లమెంటు మరియు ఇతర అధికారిక సభలలో ఆమె చేసిన ప్రసంగాలలో కూడా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలు లేవు. అయితే 2022లో ఇటలీ ఎన్నికల ప్రచార సమయంలో ఇటలీలోని ముస్లిం వలసదారుల పట్ల, వారి సిద్ధాంతాలను ఆమె విమర్శించారు. కానీ, ప్రధాని అయ్యాక ఇటలీలోని ముస్లింలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమం రాదని ఆమె చెప్పినట్లు ఆధారాలు లేవు.

Published (21 December 2023):

ఇస్లాం మతానికి యూరోప్ దేశాలలో చోటు లేదని, దీనికి ఇస్లాంకు యూరోప్‌కు మధ్య ఉన్న కంపాటబిలిటీ సమస్యలు ఒక కారణమని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఇటీవల వ్యాఖ్యలు చేసినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా షేర్ చేస్తున్నారు. ఇస్లాం సంస్కృతి ఐరోపా నాగరికతకు సరిపొదని జార్జియా మెలోని అన్నట్టుగా ఈ పోస్టులోని వీడియోలో తెలుపుతున్నారు. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఇటీవల ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముండో చూద్దాం. 

క్లెయిమ్: ఇస్లాంకు ఐరోపాకు మధ్య కంపాటబిలిటీ సమస్యలున్నాయని జార్జియా మెలోని ఇటీవల వ్యాఖ్యలు చేశారు.

ఫాక్ట్ (నిజం): ఈ వ్యాఖ్యలను జార్జియా మెలోని 2018లో, ఇటలీ ప్రధానమంత్రిగా ఎన్నికవకముందు చేశారు. 2018లో ఒక ఇంటర్వ్యూలో జార్జియా మెలోని మాట్లాడుతూ, ఇస్లాంకు ఐరోపా యొక్క విలువలు మరియు నాగరికతతో కంపాటబిలిటీ లేదని వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసలను నీయంత్రించడంలో తమ ప్రభుత్వం విఫలమైందని జార్జియా మెలోని ఇటీవల వ్యాఖ్యలు చేశారు. కానీ, ఇస్లాంకు ఐరోపాతో కంపాటబిలిటీ సమస్య ఉందని జార్జియా మెలోని ఇటీవల మళ్ళీ వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ కాలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.  

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించి కీ పదాలను ఉపయోగించి వెతికితే, జార్జియా మెలోని ఇస్లాంకు సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలే 2018లో, అంటే తను ఇటలీ ప్రధానమంత్రిగా ఎన్నికవకముందు, చేశారని తెలిసింది. “ఇస్లాం ఐరోపా విలువలకు విరుద్ధంగా ఉంది”, అని మాటియొ సాల్వాని చేసిన వ్యాఖ్యలను జార్జియా మెలోని సమర్ధిస్తూ, “సాల్విని చెప్పింది నిజమే. ఇస్లాం మన సంస్కృతికి విరుద్ధం”, అని వ్యాఖ్యలు చేశారు.  

2018లో ఒక ఇంటర్వ్యూలో జార్జియా మెలోని మాట్లాడుతూ, “ఇస్లాం ఖచ్చితంగా మన విలువలు మరియు మన నాగరికతతో కంపాటబిలిటీ లేదని నేను నమ్ముతున్నాను, ఇస్లామిక్ కేంద్రాలలో జరిగేది దీనికి నిదర్శనం. దీని అర్థం జెనెరలైజ్ చేయడం కాదు, కానీ మన సంస్కృతికి ఇస్లాంకు కంపాటబిలిటీ లేదు.”, అని తెలిపారు.

జార్జియా మెలోని 2022 సెప్టెంబర్ నెలలో ఇటలీ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అక్రమ వలసలను నీయంత్రించడంలో తమ ప్రభుత్వం విఫలమైందని జార్జియా మెలోని ఇటీవల రోమ్ నగరంలో జరిగిన ఒక రాజకీయ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు. కానీ, ఇస్లాంకు ఐరోపాతో కంపాటబిలిటీ సమస్య ఉందని జార్జియా మెలోని ఇటీవల మళ్ళీ వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ కాలేదు. 

చివరగా, ఇస్లాంకు ఐరోపా మధ్య కంపాటబిలిటీ సమస్యలున్నాయని జార్జియా మెలోని 2018లో చేసిన వ్యాఖ్యలను ఇటీవల చేసినవిగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll