రజనీకాంత్ జైలర్ ఆడియో లాంచ్ రోజున ‘అర్ధం అయ్యిందా రాజా’ అని అన్న మాటల్ని, తమిళ సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖలపై స్పందిస్తూ అన్నవని సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ రజని అన్న మాటలకి స్పందించారని way2news వారి గ్రాఫిక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: ఈ way2news గ్రాఫిక్, జైలర్ ఆడియో ఫంక్షన్లో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించిన వార్తను చూపుతుంది.
ఫాక్ట్(నిజం): ఈ way2news గ్రాఫిక్ మార్ఫ్/ఎడిట్ చెయ్యబడింది. ఈ గ్రాఫిక్ పైన ఉన్న లింక్ (way2.co/d3k3fa) ‘లిస్ట్-A క్రికెట్లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్లు’ అనే వార్తా కథనానికి చెందినది. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
way2Newsలో ఈ వార్తా కథనం వచ్చిందా లేదా అని వెరిఫై చెయ్యటానికి ఈ గ్రాఫిక్ పైన ఉన్న url / వెబ్ అడ్రస్ (లింక్) ‘way2.co/d3k3fa’ని గూగుల్ క్రోమ్ URL బార్లో టైపు చేసి చూడగా, ‘లిస్ట్-A క్రికెట్లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్లు అనే హెడ్లైన్ ఉన్న Way2newsలో వచ్చిన ఒక వార్తా కథనం లభించింది. ఈ కథనం పబ్లిష్ చేసిన సమయం ఇంకా రోజు, వైరల్ గ్రాఫిక్ పైన ఉన్న వాటితో సరిపోయితున్నాయి.

సహజంగా way2news వారి కథనాలపైన ఆ కథనానికి చెందిన వెబ్ అడ్రెస్స్ యొక్క టెక్స్ట్ ఉంటుంది. ఉదాహరణకి రష్యా లూనార్ లాండర్ లూనా-25 క్రాష్ లాండింగ్ పైన way2newsలో వచ్చిన కథనంపైన ఉన్న url- ‘way2.co/s338pp’ ni అడ్రస్ బార్లో సెర్చ్ చేసి చూడగా, ఇదే కథనం వచ్చింది. ఇలాగే SIIMA 2023: ఉత్తమ కమెడియన్స్ నామినేషన్స్ మీద వచ్చిన కథనం యొక్క urlని కూడా ఇలా సెర్చ్ చేసి వెతికాము. దీన్ని బట్టి మనకి వైరల్ గ్రాఫిక్ ఎడిట్ చేయబడినది అని స్పష్టం అవుతోంది.
అదనంగా, రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందించారా అని ఇంటర్నెట్లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి చూడగా, దీన్ని రుజువు చెయ్యటానికి మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు.
చివరిగా, రజనీకాంత్ వ్యాఖలపై పవన్ కళ్యాణ్ స్పందించారు అని ఒక ఎడిట్ చేసిన way2news గ్రాఫిక్ టెంప్లేట్ షేర్ చేస్తున్నారు.