Fake News, Telugu
 

హైతి ప్రజలు మట్టి ముద్దలు తింటారనేది నిజం. కానీ తిండిలేనప్పుడు మాత్రమే కాదు, సాంప్రదాయ ఔషధం లాగా చాలా ఏళ్ళగా తింటున్నారు

0

హైతి దేశంలో తినడానికి తిండిలేక ప్రజలు మట్టి ముద్దలు తింటున్నారని ఉన్న ఒక వీడియో వైరల్ అవ్వడంతో దాంట్లో నిజం ఎంతుందో తెలుసుకోమని కొందరు వాట్స్ ఆప్ ద్వారా FACTLY ని కోరారు.

అలాంటి వీడియో కోసం ఫేస్బుక్ లో వెతకగా, చాలా వీడియోలు ఉన్నట్టు తెలిసింది. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): హైతి అనే దేశంలో తినడానికి తిండిలేక మట్టి ముద్దలను తింటూ బ్రతుకుతున్నారు.

ఫాక్ట్ (నిజం): హైతి ప్రజలు మట్టి ముద్దలు తింటున్నారనేది నిజం. కానీ తిండిలేనప్పుడు మాత్రమే కాదు, సాంప్రదాయ ఔషధం లాగా కూడా వాడుతారు. అంతే కాదు, అన్ని రకాల మట్టితో ఆ ముద్దలను చేయరు, ఖనిజాలు ఉన్న ఒక రకమైన మట్టితోటే ఆ ముద్దలను చేస్తారు. కావున పోస్ట్ లో చెప్పింది కొంతవరకు నిజం.

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో ‘Haiti people eat mud’ అని వెతకగా, అంతర్జాతీయంగా ప్రచురించిన చాలా ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ఆ ఆర్టికల్స్ (The Guardian, The Telegraph, Dailymail) లో తినే పదార్థాల ధరలు బాగా పెరగడంతో పేదవాళ్ళు మట్టితో చేసిన ముద్దలను తింటున్నారని ఉంటుంది. ఆ ముద్దల్లో ఎక్కువ పోషణ ఉండదు (మట్టీ, ఉప్పు, మార్గరైన్ మరియు నీళ్ళు కలిపి చేస్తారు), కానీ ఆకలి తీరడానికి అవి తింటారు. పోస్ట్ లోని వీడియోని యూట్యూబ్ లో ‘World Focus’ అనే సంస్థ అప్లోడ్ చేసింది. ఆ వీడియో చూస్తే కూడా పేదరికంలో ఉన్న ప్రజలు ఆ మట్టిముద్దలను తింటున్నారని ఉంటుంది.

హైతిలో పేద ప్రజలు మట్టిముద్దలను తింటున్నారు కానీ డబ్బులు ఉన్నవాళ్లు కూడా హైతిలో ఆ మట్టిముద్దలను తింటారని ‘World Food Programme (WFP)’ అనే ఐక్య రాజ్య సమితి చెందిన సంస్థ ఒక వీడియోని యూట్యూబ్ లో పెట్టింది. పేద ప్రజలే కాదు చాలా మంది ఆ ముద్దలను సాంప్రదాయ ఔషధం లాగా వాడుతారు. అంతే కాదు, అన్ని రకాల మట్టితో ఆ ముద్దలను చేయరు, ఖనిజాలు ఉన్న ఒక రకమైన మట్టితోటే ఆ ముద్దలను చేస్తారని WFP వీడియో లో ఉంటుంది. పురాతన కాలం నుండి మట్టి తింటున్నారని, వాటి వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయని చెప్తూ WFP వీడియో చివరన రాసారు. అంతే కాదు, The Guardian మరియు The Telegraph ఆర్టికల్స్ లో కూడా చాలా ఏళ్ళగా సాంప్రదాయంగా ఈ మట్టి ముద్దలను గర్భిణీలు మరియు పిల్లలు తింటుండే వారని, ఈ మధ్య పేదరికంతో కూడా ఇవి తింటున్నారని ఉంటుంది.

చివరగా, హైతి ప్రజలు మట్టి ముద్దలు తింటారనేది నిజం. కానీ తిండిలేనప్పుడు మాత్రమే కాదు, సాంప్రదాయ ఔషధం లాగా చాలా ఏళ్ళగా తింటున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll