Fake News, Telugu
 

వీడియోలో కనిపించేవి పాకిస్తాన్ జెండాలు కాదు. అవి ఇస్లాం మత జెండాలు

0

“దేశంలో టెర్రరిస్టులు జొరపడ్డారు, అయినా మౌనంగా కూర్చున్నాం. మన ముందు పాకిస్తాన్ జెండాలు పట్టుకొని తిరుగుతున్న చూస్తూ కూర్చున్నాం……” అంటూ ఫేస్బుక్ లో  పోస్ట్ చేసి, ఆ వీడియోలో కనిపించేవి పాకిస్తాన్ దేశ జెండాలు అని పేర్కొంటున్నారు. పోస్ట్ లో ఆరోపించిన విషయాల్లో ఎంత వరకు నిజముందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): దేశంలో టెర్రరిస్టులు జొరపడ్డారు. మన ముందు పాకిస్తాన్ జెండాలు పట్టుకొని తిరుగుతునారు.

ఫాక్ట్ (నిజం): ఆ వీడియోని గనుక మనం క్షుణ్ణంగా గమనిస్తే అందులో ఉన్నది పాకిస్తాన్ జెండా కాదని, అవి ఇస్లాం మత జెండాలు అని అర్థం అవుతుంది. కావున పోస్ట్ లో చెప్పిన విషయంలో ఎటువంటి నిజం లేదు.

పాకిస్తాన్ జాతీయ జెండా మరియు ఇస్లాం మత జెండా చూడ్డానికి ఒకేలా ఉన్నా, వాటిల్లో చిన్న భేదాలు ఉంటాయి. ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన వీడియోని జాగ్రత్తగా గమనిస్తే,  అందులో ఉన్నది పాకిస్తాన్ జెండా కాదు, ఇస్లాం మత జెండా అని తెలుస్తుంది. గతం లో కూడా ఇస్లాం మత జెండాని పాకిస్తాన్ జెండాగా చెప్తూ చాలా ఫేక్ వార్తలు వచ్చాయి. క్రింద ఫోటోలో రెండు జెండాలకూ ఉన్న తేడా గమనించవొచ్చు.

పైన ఫోటోలో ఎడమ వైపున ఉన్నది ఇస్లాం మత జెండా.  కుడి వైపున ఉన్నది పాకిస్తాన్ జాతీయ జెండా. పాకిస్తాన్ జెండాకి ఎడమ వైపున తెలుపు రంగు స్ట్రిప్ ఒకటి ఉంటుంది. పాకిస్తాన్ జాతీయ జెండా కి సంబందించిన వివరాలు వారి ఎంబసీ వెబ్సైటు లో క్షుణ్ణంగా వివరించారు.

చివరగా, వీడియోలో కనిపించేవి పాకిస్తాన్ జెండాలు కాదు. అవి ఇస్లాం మత జెండాలు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll