Fake News, Telugu
 

‘రామసేతు 7 లక్షల సంవత్సరాల క్రితంది’ అని NASA ఎక్కడా కూడా పేర్కొనలేదు

0

7 లక్షల సంవత్సరాల క్రితం రామసేతు మానవ నిర్మాణం అని నాసా సంస్థ పేర్కొన్నట్లుగా కొంతమంది ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.    

క్లెయిమ్ (దావా): 7 లక్షల సంవత్సరాల క్రితం రామసేతు మానవ నిర్మాణం అని నాసా సంస్థ పేర్కొన్నది 

ఫాక్ట్ (నిజం): నాసా సంస్థ రామసేతు (ఆడమ్స్ బ్రిడ్జి) ఎలా నిర్మించబడినదని గానీ, ఎప్పుడు నిర్మించబడినదని గానీ ఎక్కడా కూడా అధికారంగా వెల్లడించలేదు. కావున, పోస్ట్ లో 7 లక్షల సంవత్సరాల క్రితం రామసేతు మానవ నిర్మాణం అని నాసా సంస్థ పేర్కొనడం అవాస్తవం.    

గూగుల్ లో రామసేతు నిర్మాణం గురించి నాసా సంస్థ పేర్కొన్న విషయాల గురించి వెతికినప్పుడు “Livemint” వారు ప్రచురించిన కథనం ఒకటి లభించింది. 2007లో రామసేతు నిర్మాణం గురించి అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీకి మరియు విశ్వ హిందూ పరిషద్ కి మధ్య సుప్రీమ్ కోర్ట్ లో వివాదం జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాసా డాక్యుమెంటేషన్ రామసేతు సహజ నిర్మాణమేనని, మానవ నిర్మాణం అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నట్లుగా కోర్ట్ కి ఇచ్చిన అఫిడవిట్ లో తెలిపింది. అప్పుడు నాసా సంస్థ వారు, తమ ఆస్ట్రనాట్స్ ఆడమ్స్ బ్రిడ్జ్ (రామసేతు) కి సంబంధించి తీసిన ఫోటోలను ఇతరులు  తప్పుగా అర్ధం చేసుకుంటున్నారనీ, తమ సంస్థకి ఆడమ్స్  బ్రిడ్జ్ మూలాల గురించి ఎటువంటి అభిప్రాయం లేదు అని స్పష్టం చేసింది. కావున, పోస్టులో పేర్కొన్న విషయంలో నిజం లేదు.

నాసా వెబ్సైటు లో రామసేతు (ఆడమ్స్ బ్రిడ్జి) గురుంచి ఒక ఫోటో లో“హిందూ మతానికి పవిత్రమైన ఈ వంతెనను ఈ ప్రాంతంలోని అనేక నగరాలను సందర్శించిన రాముడు నిర్మించాడని చెపుతుంటారు.” అని మాత్రమే ఉంటుంది.

చివరగా, రామసేతు 7 లక్షల సంవత్సరాల క్రితందని NASA ఎక్కడా కూడా పేర్కొనలేదు

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll