చాలామంది ఫేస్బుక్ యూజర్స్ బీజేపీ నాయకులు ఉన్న ఒక ఫోటో మరియు కాంగ్రెస్ నాయకులు ఉన్న మరో ఫోటో తో కూడిన పోస్ట్ ని షేర్ చేస్తున్నారు. బీజేపీ నాయకులకు సంబంధించి పెట్టిన ఫోటోలో అమిత్ షా అద్వానీ ని అగౌరవపరచినట్టుగా ఉంది. ఇందులో ఎంతవరకు నిజముందో ఓసారి విశ్లేషిద్దాం.
క్లెయిమ్ (దావా): బీజేపీ నేషనల్ కౌన్సిల్ మీట్ లో అమిత్ షా అద్వానీని అగౌరవపరిచారు
ఫాక్ట్ (నిజం): బీజేపీ నేషనల్ కౌన్సిల్ మీట్ -2014 సమయంలో చిత్రీకరించిన వీడియోని చూసినట్లయితే అందులో అమిత్ షా అద్వానీని కించపరచినట్లుగా ఎక్కడా లేదు. కావున పోస్ట్ ప్రక్కద్రోవ పట్టించేలా ఉంది.
పోస్ట్ లో బీజేపీ నాయకులు ఉన్న ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది బీజేపీ నేషనల్ కౌన్సిల్ మీట్ -2014 కి సంబంధించినది అని తెలిసింది. ఆ సమాచారం ఆధారంగా యూట్యూబ్ లో వెతికినప్పుడు ఆ వేడుకకు సంబంధించిన వీడియో లభించింది. అందులో 21 ని.30 సెకండ్ల నుండి చూసినట్లయితే అమిత్ షా అద్వానీని కుర్చీలో ఉండి ప్రసంగించమని కోరినప్పుడు ఆయన పోడియం నుండి ప్రసింగిస్తాను అని తెలిపినట్లుగా అర్ధం అవుతుంది. అప్పుడు అద్వానీ లేచి నిలుచోగా, అమిత్ షా పోడియం ఉన్న దిశను చూపించారు. ఆ సమయంలో తీసిన ఫోటోని తప్పుడు ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారు.
చివరగా, బీజేపీ నేషనల్ కౌన్సిల్ మీట్ లో అమిత్ షా అద్వానీని అగౌరవపరిచారు అనేది అవాస్తవం.