ఎన్నికలు వస్తే చాలు EVM (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్) ల మీద ఎదో ఒక విషయం వివాదాస్పదం అవుతూనే ఉంటుంది. తాజాగా EVM ఒకటి ప్రైవేటు ఇంట్లో దొరికింది అంటూ ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
క్లెయిమ్ (దావా): నిజామాబాద్-మహారాష్ట్ర బోర్డర్ లోని ఒక ప్రైవేటు ఇంట్లో దొరికిన EVM బాక్స్
ఫాక్ట్ (నిజం): ప్రైవేటు ఇంట్లో EVM బాక్స్ దొరికిన మాట నిజమే, కానీ అది గత సంవత్సరం రాజస్తాన్ లోని పాలీ లో దొరికింది. కావున పోస్ట్ లో నిజామాబాద్-మహారాష్ట్ర బోర్డర్ అని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు.
గూగుల్ లో ‘EVM found at house” అని వెతకగా ఈ విషయం కి సంభందించి వివిధ వార్తా పత్రికలు ప్రచురించిన ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. వాటిల్లో Business Standard ఆర్టికల్ తీసుకుంటే ఆ EVM ప్రైవేటు ఇంట్లో దొరకడం నిజమేనని కానీ అది గత సంవత్సరం రాజస్తాన్ లో ఎన్నికలు జరిగిన సందర్భంలో జరిగిన సంఘటనగా తెలుస్తుంది. అంతే కాకుండా, యూట్యూబ్ లో డిసెంబర్ 2018 లో అప్లోడ్ చేసిన ఇదే వీడియో కూడా దొరుకుతుంది. వీడియో లో చాలా క్లియర్ గా, పాలి లోని ఆదర్శ్ నగర్ అని అనడం కూడా మనం వినొచ్చు. అంతే కాకూండా, News Central (24X 7) అనే డిజిటల్ న్యూస్ వెబ్సైటు డిసెంబర్ 2018 లోనే ఈ వీడియో తో పాటు పాలిలో దొరికిన EVM గురుంచి రాసింది.
రాజస్తాన్ లోని పాలీ నియోజికవర్గంలో బీజేపీ అభ్యర్థి ఇంట్లో ఆ EVM దొరికిందని ఆ సమయంలో AP-24X7 కూడా తమ ఛానల్ లో న్యూస్ ప్రసారించింది. కావున పోస్ట్ లో నిజామాబాద్-మహారాష్ట్ర బోర్డర్ లో జరిగినట్టుగా చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
చివరగా, ప్రైవేటు ఇంట్లో EVM దొరికింది గత సంవత్సరం రాజస్తాన్ లో, తాజాగా నిజామాబాద్-మహారాష్ట్ర బోర్డర్ లో కాదు.
1 Comment
Great and elated..