Fake News, Telugu
 

పాక్ కు వెళ్లే సింధు జలాలను ఆపివేయాలనే నిర్ణయం భారత్ తీసుకుందా ?

0

పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ కి వెళ్ళే సింధు జలాల మీద మళ్ళి అందరు తమ అభిప్రాయాలు తెలపడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ‘మిషన్ మోడీ 2019’ అనే పేజీ సింధు జలాల మీద భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ఒక పోస్ట్ చేసింది . పాకిస్తాన్ కి భూభాగంగా వెళ్ళే సింధు జలాలను భారత ప్రభుత్వం నిలిపివేసిందని మరియు సింధు జలాలను కాశ్మీర్ మరియు పంజాబ్ వైపు మళ్లించిందని ఆ పోస్ట్ తెలియచేస్తుంది.  ఆ పోస్ట్ లో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్ (దావా): పాకిస్తాన్ పై వాటర్ వార్. భారత భుభాగం గుండా పాకిస్తాన్ లోకి వెళ్ళే సింధు జలాలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. సింధు జలాలను కాశ్మీర్, పంజాబ్ వైపు మళ్లించి ఊహించని షాక్ ఇచ్చింది.

ఫాక్ట్ (నిజం): భారత ప్రభుత్వానికి మొత్తం సింధు జలాల మీద హక్కు లేదు. కేవలం ఈశాన్యపు నదుల (రవి, బీయాస్, సట్లేజ్) మీద పూర్తి స్థాయి లో నీళ్ళు వాడుకునే  హక్కు ఉంది. 1960 లో వరల్డ్ బ్యాంకు కుదిర్చిన ఒప్పందం ప్రకారం మొత్తం సింధు జలాల్లో 20 శాతం మాత్రమే భారత్ ఉపయోగించుకోవచ్చు. ఆ 20 శాతం ని కూడా ఇప్పటివరకు భారత ప్రభుత్వం పూర్తిగా ఉపయోగించుకోవట్లేదు. పుల్వామా దాడి తర్వాత మనకు హక్కు ఉన్న జలాలని కొంత కూడా పాకిస్తాన్ కి వెళ్ళకుండ భారత ప్రభుత్వం కొన్ని ప్రాజెక్ట్ లకు  ఆమోదం తెలిపింది. నితిన్ గడ్కారి ట్వీట్ చేసిన ట్వీట్ల ప్రకారం సింధు ఈశాన్య నదుల మీద ప్రాజెక్ట్స్ నిర్మించడమే కాకుండా కొంత నీరును వేరే ప్రదేశాలకు కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్ట్ లు నిర్మించడానికి కొంత టైం పడుతుంది కావున పోస్ట్ లో చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం మొత్తం సింధు జలాలను నిలిపివేయలేదు.

చివరగా, మొత్తం సింధు జలాలను కేంద్రం నిలిపివేయలేదు. కేవలం పాకిస్తాన్ కి వృధాగా వెళ్ళే భారత్ యొక్క వాటా నీళ్ళను పూర్తిగా ఉపయోగించుకోవడానికి కొన్ని ప్రోజేక్ట్ లకి కేంద్రం ఆమోదం తెలిపింది.

Share.

About Author

Comments are closed.

scroll