Fake News, Telugu
 

చైనాలోని లాంగ్మెన్ గుహల ఫోటోని ఎడిట్ చేసి కర్ణాటక లో మసీదు కింద గుడి అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

కర్ణాటక లోని రాయచూరు లో మసీదు పడగొడితే కింద గుడి కనిపించిందంటూ ఒక ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ ఫోటో లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): పోస్ట్ లోని ఫోటో కర్ణాటక రాయచూరు లోని ఒక గుడిది. ఆ గుడి రోడ్ కోసం మసీదు పడగొట్టినప్పుడు బయటపడింది.

ఫాక్ట్ (నిజం): చైనా లోని ఒక గుహ ఫోటో తీసుకొని భుద్ధుడి స్థానంలో హిందూ దేవత విగ్రహాన్ని ఫోటో షాప్ చేసి పెట్టారు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లోని ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, రిజల్ట్స్ లో పోస్ట్ చేసిన ఫోటో లాంటి ఫొటోలే చాలా వస్తాయి. కానీ ఆ ఫోటోలల్లో హిందూ దేవత స్థానంలో బుద్ధుడి విగ్రహం ఉంటుంది. బుద్ధుడి విగ్రహం ఉన్న ఫోటోల కింద వివరణ చదవగా అది చైనా లోని లాంగ్మెన్ గుహల్లో తీసిన ఫోటో అని తెలుస్తుంది. పోస్ట్ చేసిన ఫోటోలో ఫోటోషాప్ చేసి దేవీ విగ్రహాన్ని, పూజారిని మరియు భక్తులను పెట్టారు. ఆ గుహల మీద మరింత సమాచారాన్ని టైమ్స్ ట్రావెల్ ఆర్టికల్ లో చూడవచ్చు.

చివరగా, చైనాలోని లాంగ్మెన్ గుహల ఫోటోని ఎడిట్ చేసి కర్ణాటక లో మసీదు కింద గుడి అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll