Fake News, Telugu
 

BBC వారు మోడీ EVM టాంపరింగ్ చేయిపించాడని, ఆ డీల్ విలువ 20 వేల కోట్లని ఎక్కడా వెల్లడించలేదు

0

‘మోడీ EVM ట్యాపింగ్ 20 వేల కోట్ల డీల్, తేల్చేసిన BBC సంస్ధ’ అంటూ కొంతమంది ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు. ఈ పోస్ట్ లో పేర్కొన్న ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉందొ విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): మోడీ EVM టాంపరింగ్ డీల్ విలువ 20 వేల కోట్లని BBC వార్తా సంస్ధ వెల్లడించింది.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఉన్నది 2018లో ఒక న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన న్యూస్ బులెటిన్ కి సంబంధించిన ఫోటోలు. BBC తన కథనాల్లో ఎక్కడా కూడా మోడీ EVM టాంపరింగ్ చేయిపించాడని, ఆ డీల్ విలువ 20 వేల కోట్లని వెల్లడించలేదు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో ఉన్నది “CVR News” వారు ప్రసారం చేసిన న్యూస్ అని తెలుస్తుంది. యూట్యూబ్ లో ఆ వార్తా కథనం గురించి వెతికినప్పుడు, న్యూస్ బులెటిన్ లభించింది. ఆ వీడియో యొక్క టైం స్టాంప్ చూసినట్లయితే అది 2018లో ప్రసారం అయినట్లుగా అర్ధం అవుతుంది. అంటే ఏప్రిల్-మే 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రసారం అయిన వీడియో అది. 

అట్లానే BBC వార్తా సంస్ధ “భారత దేశ EVM ల హ్యాకింగ్” కి సంబంధించి ప్రచురించిన కథనాల గురించి వెతికినప్పుడు, ఆ వార్తా సంస్థ 2010లో ప్రచురించిన కథనం లభించింది. అందులో, అమెరికాకి చెందిన యూనివర్సిటి ఆఫ్ మిషిగన్ శాస్త్రవేత్తలు భారతదేశ EVM లను హ్యాకింగ్ చేయవచ్చని నిరూపించారని BBC వారు ప్రచురించారు. అంతే కానీ  BBC వారు ఎక్కడా కూడా మోడీ EVM టాంపరింగ్ చేపించాడని, ఆ డీల్ విలువ 20 వేల కోట్లని వెల్లడించలేదు.

చివరగా, BBC వారు మోడీ EVM టాంపరింగ్ చేపించాడని, ఆ డీల్ విలువ 20 వేల కోట్లని ఎక్కడా వెల్లడించలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll