జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సెక్రటేరియట్ లో మొదలైన మార్పు అని చెప్తూ రెండు ఫోటోలతో ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో పని చేయకుండా అధికారులు రెస్ట్ తీసుకుంటున్నారు
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటోలు చాలా పాత ఫోటోలు. అవి అసలు ఆంధ్రప్రదేశ్ లో తీసినవే కావు, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినవి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ ఫోటోని 2015 లోనే ఒక వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. కావున ఫేస్బుక్ పోస్ట్ లోని ఫోటో ఇప్పటిది కాదు.
ట్వీట్ లో ఆ ఫోటో గుజరాత్ RTO ఆఫీస్ కి సంబంధించినదని రాసి ఉంటుంది. అంతే కాదు ఆ ట్వీట్ లో ఆఫీసుని ఇంకో కోణం నుండి తీసిన ఫోటో ఉంటుంది. ఆ ఫోటో లో గోడ మీద ‘No Smoking’ బోర్డు చూడవచ్చు. ఆ బోర్డు మీద ‘No Smoking’ అని ఏదో బాష లో రాసి ఉంటుంది. ట్వీట్ లో గుజరాత్ ఆఫీస్ అని రాసి ఉంది కాబట్టి ఆ ‘No Smoking’ బోర్డు మీద గుజరాతీ లో రాసారా అని చెక్ చేయగా అది గుజరాతీ అని తెలుస్తుంది. కాబట్టి అది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఆఫీసు, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ కాదు.
చివరగా, గుజరాత్ లో తీసిన పాత ఫోటో పెట్టి జగన్ అధికారంలో ఆంధ్ర సెక్రటేరియట్ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?