తెలంగాణ లోని కరీంనగర్ జిల్లా కేశవపట్నం కస్తుర్భా పాఠశాలలో విద్యార్థులు ఆహారం తిని దాదాపు 40మంది అస్తవ్యస్థకు గురయ్యారని , ఒక వీడియో ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత వరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్ (దావా): పోస్ట్ లోని వీడియో కరీంనగర్ జిల్లా కేశవపట్నం కస్తుర్భా పాఠశాలలో విద్యార్థులది. ఇక్కడ ఆహారం తిని దాదాపు 40మంది అస్తవ్యస్థకు గురయ్యారు.
ఫాక్ట్ (నిజం): కరీంనగర్ లో ఈ సంఘటన జరిగింది నిజమే అయినప్పటికీ, పోస్ట్ లో పెట్టిన వీడియో కి, కరీంనగర్ సంఘటన కి సంబంధం లేదు. పోస్ట్ లో పెట్టిన వీడియో జమ్మూ లోని కథువా లో ఒక ప్రభుత్వ హై స్కూల్ లో విద్యార్థినులు ఓదార్చడానికి వీలు లేకుండా ఏడ్చిన సంఘటన కి సంబంధించింది. కాబట్టి పోస్ట్ లో పెట్టిన విషయానికి, వీడియో కి ఎటువంటి సంబంధం లేదు.
‘girls crying inconsolably india’ అని గూగుల్ మరియు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే, ఇదే వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఇదే వీడియో ని చాలా మంది యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
అంతే కాదు, దీని గురుంచి అనేక వార్త సంస్థలు గత వారం రిపోర్ట్ చేసాయి. ది హిందూ, ఇండియా టుడే, ఔట్లుక్ , టైమ్స్ అఫ్ ఇండియా, IANS లాంటి వార్త సంస్థలన్నీ ఈ విషయం గురుంచి రాశాయి. ఈ కథనాల ప్రకారం, ఈ నెల (జూన్ 13 & 14) తేదీలలో జమ్మూ లోని కథువా జిల్లా బాని ప్రభుత్వ పాఠశాల కి చెందిన 20-25 మంది విద్యార్థులు ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టారని, అసలు ఓదార్చ దానికి వీలు లేకుండా ఏడ్చారని తెలుస్తోంది. స్థానిక విద్యా శాఖ అధికారి ప్రకారం, డాక్టర్లు కూడా తక్షణమే వచ్చారని, సైకాలజిస్ట్ కూడా వెంటనే సంఘటన స్థలానికి వచ్చారని తెలిసింది. ఈ వార్త కథనాల ప్రకారం, అంతకు ముందు కూడా కొంత మంది విద్యార్థులు ఇదే విధంగా ఇంటి దగ్గర ప్రవర్తించారని తెలుస్తోంది. కానీ అంత ఎక్కువ మంది ఆ విధంగా ప్రవర్తించడం ఇంకా ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.
ఇదే వీడియోని ఇంకొంత మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తూ ఎక్కడో హర్యానా లోని ఒక గ్రామం లోని స్కూల్ లో విద్యార్థులు భూతాలు ఆవహించి ఇలా ప్రవర్తించారని పెట్టారు.
ఇక పోతే కరీంనగర్ లోని ఒక మోడల్ స్కూల్ విద్యార్థులు ఆహరం తిని ‘food poisoning’ వల్ల ఆసుపత్రిలో చేరారు అన్నది నిజమే. కానీ ఆ సంఘటన కి, ఈ వీడియో కి ఎటువంటి సంబంధం లేదు.
చివరగా, కరీంనగర్ లో ఈ సంఘటన జరిగింది నిజమే అయినప్పటికీ, పోస్ట్ లో పెట్టిన వీడియో కి, కరీంనగర్ సంఘటన కి సంబంధం లేదు. ఎక్కడో జమ్మూ లో జరిగిన సంఘటన సంబందించిన వీడియో పెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?