Fake News, Telugu
 

అక్షరాస్యతలో తెలంగాణ స్థానం బీహార్ కన్నా హీనం కాదు.

0

కొంత మంది ఫేస్బుక్ యూజర్స్  ఒక వార్తా పత్రిక  ‘అక్షరాస్యతలో అట్టడుగున బీహార్ రాష్ట్రం, తర్వాతి  స్ధానంలో తెలంగాణ’ అంటూ ప్రచురించిన ఒక ఆర్టికల్ యొక్క క్లిప్ తో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో  ఎంతవరకు నిజముందో ఓసారి విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): బీహార్ కన్నా హీనం..అక్షరాస్యతలో తెలంగాణ స్థానం.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ చేసిన ఆర్టికల్ లో బీహార్-2011 అక్షరాస్యత శాతం మరియు తెలంగాణ ప్రభుత్వ వెబ్సైటు లో ఉన్న అక్షరాస్యత శాతాన్ని లను పరిగణలోకి తీసుకున్నారు. అలా తీసుకున్నా అక్షరాస్యతలో చివరి స్థానంలో బీహార్ రాష్ట్రం ఉండగా, దాని ముందు స్ధానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. వార్తా పత్రిక లో ఉన్నదానికి రివర్స్ లో క్లెయిమ్ ఉంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో పెట్టిన ఆర్టికల్ కోసం వెతికినప్పుడు  అది “నవ తెలంగాణ” వారు అక్టోబర్ 15,2018 న ప్రచురించినది  అని తెలిసినది. ఆ ఆర్టికల్ లో వివిధ రాష్ట్రాల అక్షరాస్యత గురుంచి చెప్తూ, తెలంగాణ ప్రస్తావన ఉంటుంది. 2011 సెన్సస్ సమయానికి తెలంగాణ రాష్ట్రం లేనందున, అధికారిక సెన్సస్ వెబ్సైటు లో తెలంగాణ గురుంచి ఉండదు. కాబట్టి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లెక్కలు ప్రచురించింది. దాని ప్రకారం 2011 సెన్సస్ నాటికి తెలంగాణ అక్షరాస్యత శాతం 66.54%.

అలాగే, సెన్సస్- 2011 ప్రకారం బీహార్ రాష్ట్రం 63.82 అక్షరాస్యత శాతం తో అట్టడుగు స్థానంలో నిలవగా అరుణాచల్ ప్రదేశ్ 66.95 అక్షరాస్యత సంఖ్య తో చివరి నుండి రెండవ స్థానంలో నిల్చింది . కాబట్టి 2011 లెక్కల ప్రకారం బీహార్ కంటే తెలంగాణ అక్షరాస్యత శాతం ఎక్కువ .

అదే విషయాన్నీ నవ తెలంగాణ రాసిన ఆర్టికల్ లో తెలంగాణ రాష్టం చివరి నుండి రెండవ స్థానంలో ఉందని పేర్కొన్నారు. కానీ పోస్ట్ లో మాత్రం తెలంగాణ అక్షరాస్యత బీహార్ కంటే హీనం అని తిప్పి రాసారు.

అదే కాదు, 2011 సెన్సస్ లెక్కల ప్రకారం ఉన్న అక్షరాస్యత శాతం ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యంగా చూపిస్తున్నారు. చివరగా, పోస్ట్ లో చెప్పినట్టు 2011 లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత శాతం బీహార్ కంటే హీనం కాదు. అలానే, ఆ లెక్కలు 2011 కి సంబందించినయి, ప్రస్తుత ప్రభుత్వ హయాంకి సంబందించిన లెక్కలు కాదు.

ప్రతి వారం, మేము ‘ఏది ఫేక్, ఏది నిజం’ అనే తెలుగు యూట్యూబ్ షో చేస్తున్నాం. మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll