Fake News, Telugu
 

ఆ ఫోటోని కాంగ్రెస్ వారు అసంపూర్తిగా క్రాప్ చేసారు. అది నిజమైన ఫోటోనే

0

ఫేస్బుక్ లో “ఒక మనిషికి మూడు చేతులు ఎలా ఉంటాయి కాంగ్రెస్ ఎడిటర్స్?” అంటూ  రాహుల్ గాంధీ ఒక ముసలి ఆవిడని ఓదారుస్తున్నటువంటి చిత్రాన్ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఈ ఫోటో ఎంతవరకు నిజమో ఓసారి విశ్లేషిద్దాం .

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): రాహుల్ గాంధీ, ఒక ముసలి ఆవిడని ఓదారుస్తున్నటువంటి చిత్రాన్ని కాంగ్రెస్ వారు ఎడిట్ చేసి సృష్టించారు.

ఫాక్ట్ (నిజం): రాహుల్ గాంధీ 2015 లో పుదుచ్చేరి వరద బాధితులను కలిసిన సందర్భంలోని ఫోటోలను కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా లో చూడవచ్చు . పోస్ట్ లో పెట్టిన ఫోటో యొక్క అసలు చిత్రం ఇందులో ఒకటి. దానినే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ “NYAY” స్కీం కి క్రాప్ చేసి వాడుతుంది. ఆ ఫోటో చూస్తే పోస్ట్ లో చెప్పినట్టుగా సరిగ్గా క్రాప్ చేయలేదని తెలుస్తుంది. కావున పోస్ట్ లో చెప్పింది నిజమే.

పోస్ట్ లో ఉన్న చిత్రాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్) తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా పేదరిక నిర్మూలన పథకం “NYAY” కోసం పోస్టర్లలో విస్తృతంగా ఉపయోగించినప్పటి నుండి వార్తల్లోకి వచ్చింది. ఈ ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది రాహుల్ గాంధీ 2015 లో పుదుచ్చేరి వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పటిది అని తెలిసింది. ఆ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ వరదల వల్ల నష్టపోయిన ఒక ముసలి ఆవిడని ఓదారుస్తున్న చిత్రాన్ని చూడవచ్చు. దీని ద్వారా పోస్ట్ లో పెట్టిన చిత్రంలోని మూడవ చేయి, రాహుల్ గాంధీ మరియు ముసలి ఆవిడ పక్కకు ఉన్న వ్యక్తిది అని స్పష్టంగా తెలుస్తుంది. కాంగ్రెస్ వారు అసలు ఫోటోని అసంపూర్తిగా క్రాప్ చేయడం వాళ్ళ ఏర్పడినదే  పోస్ట్ లో పెట్టిన చిత్రం.

చివరగా, కాంగ్రెస్ వారు అసలు ఫోటోని  అసంపూర్తిగా క్రాప్ చేయడం వల్ల వచ్చిన చిత్రం

Share.

About Author

Comments are closed.

scroll