Fake News, Telugu
 

‘సౌత్ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (SCCLCIL) లో 88,585 ఉద్యోగాలు’ అంటూ వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదు.

0

88,585 ఉద్యోగాల భర్తీకి కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ‘సౌత్ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్’ (SCCLCIL) నోటిఫికేషన్ విడుదల చేసిందని చెప్తూ సోషల్ మీడియాలో ఒక నోటిఫికేషన్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ నోటిఫికేషన్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన సౌత్ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (SCCLCIL) లో 88,585 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.       

ఫాక్ట్ (నిజం): తమ అనుబంధ సంస్థల్లో అసలు ‘సౌత్ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (SCCLCIL)’ పేరుతో ఎటువంటి సంస్థ లేదని కోల్ ఇండియా లిమిటెడ్ వారు ఒక పబ్లిక్ నోటిసుని విడుదల చేసారు. అంతేకాదు, వైరల్ అవుతున్న నోటిఫికేషన్ ఫేక్ అని వారు తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న SCCLCIL  జాబ్ నోటిఫికేషన్ ని ఇక్కడ చదవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి వెతకగా, సోషల్ మీడియా లోనే కాకుండా కొన్ని ప్రముఖ వార్తాసంస్థలు [ టైమ్స్ నౌ న్యూస్ (ఆర్కైవ్డ్ లింక్), ఇండియా టుడే (ఆర్కైవ్డ్ లింక్), న్యూస్18 (ఆర్కైవ్డ్ లింక్), ఫస్ట్ పోస్ట్ (ఆర్కైవ్డ్ లింక్) మరియు డీఎన్ఏ ఇండియా (ఆర్కైవ్డ్ లింక్)]  కూడా కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన SCCLCIL  సంస్థ 88585 జాబులకు నోటిఫికేషన్ విడుదల చేసిందని వార్తలను ప్రచురించినట్టు తెలుస్తుంది.

నోటిఫికేషన్ లో అభ్యర్థులు SCCLCIL వెబ్ సైట్ (http://scclcil.in) లో దరఖాస్తు చేసుకోవాలని ఉంటుంది. కానీ ఆ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. కావున, నోటిఫికేషన్ కోసం కోల్ ఇండియా లిమిటెడ్ వెబ్ సైట్ లో వెతకగా, ఈ నోటిఫికేషన్ పై కోల్ ఇండియా లిమిటెడ్ వారు ఒక పబ్లిక్ నోటీసు విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ఆ పబ్లిక్ నోటిసు ప్రకారం అసలు ‘సౌత్ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (SCCLCIL)’ పేరుతో కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ ఏదీ లేదని, 88585 ఉద్యోగాలు అంటూ వైరల్ అవుతున్న జాబు నోటిఫికేషన్ ఫేక్ అని తెలుస్తుంది. అంతే కాదు, ఈ ఫేక్ నోటిఫికేషన్ ని నమ్మి మోసపోవద్దని ఆ నోటీసు ద్వారా కోల్ ఇండియా లిమిటెడ్ వారు ప్రజలను కోరారు. ఇదే నోటీసును కోల్ ఇండియా లిమిటెడ్ వారు తమ ట్విట్టర్ అకౌంట్ లో కూడా పోస్ట్ చేసారు.

చివరగా, ‘సౌత్ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (SCCLCIL) లో 88,585 ఉద్యోగాలు’ అంటూ వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll