ఫేస్బుక్ లో చిన్న పిల్లలను పోలీసులు నిర్బంధిస్తున్న వీడియో ఒకటి పెట్టి దాని గురించి ఈ విధంగా పేర్కొంటున్నారు- ‘కోల్కతా రాజు బజార్లో మదర్సాకు చెందిన 63 మంది పిల్లలను పోలీసులు అరెస్టు చేశారు. మదర్సాల్లో ఉగ్రవాదిగా మారడానికి శిక్షణ ఇస్తారని పిల్లలు అంటున్నారు. ఈ విషయం మీడియాలో వెళ్ళినప్పుడు, మీడియా మేము చూపించలేము అని చెప్పారు, మేము పై నుండి ఆర్డర్ చేయము కాబట్టి మీరందరూ వీలైనంత త్వరగా ఈ వీడియోను పంచుకుంటారు, తద్వారా మదర్సాల్లో ఏమి బోధిస్తారు, ఏమి బోధిస్తారు, ముస్లింల పిల్లల వాస్తవికత భారతదేశంలో ఇలాంటి శిక్షణ ఇచ్చే మదర్సాలు చాలా ఉన్నాయి. అధ్యయనాల పేరిట దేశాన్ని పంచుకునే కార్మికులను మదర్సాల్లో చేరుస్తారు, వారిని జిహాదీలుగా చేస్తారు’. పోస్ట్ లో ఆరోపించిన విషయాల్లో ఎంత వరకు నిజముందో విశ్లేషిద్దాం.

క్లెయిమ్ (దావా): కోల్కతా రాజా బజార్లో మదర్సాకు చెందిన 63 మంది పిల్లలను పోలీసులు అరెస్టు చేశారు. ఆ మదర్సాలో ఉగ్రవాదిగా మారడానికి శిక్షణ ఇస్తారని పిల్లలు అన్నారు.
ఫాక్ట్ (నిజం): బీహార్ రాష్ట్రానికి చెందిన 63 మంది పిల్లలు పూణే లోని మదర్సా లో చేరడానికి ట్రైన్ లో వెళ్తున్నపుడు బెంగాల్ రైల్వే పోలీసులు వారికి సరైన పత్రాలు లేని కారణంగా కోల్కతా లోని సీల్దా రైల్వే స్టేషన్ లో నిర్బంధించారు. కావున పోస్టులో చేసిన ఆరోపణల్లో నిజం లేదు.
ఫేస్బుక్ పోస్ట్ లో పేర్కొన్న విషయాల ఆధారంగా గూగుల్ లో “muslim 63 children arrested police kolkata” అనే కీవర్డ్స్ తో వెతికినప్పుడు ఆ ఘటనకి సంబంధించిన చాలా వార్తా పత్రిక కథనాలు లభించాయి.


“Indian Express” వారు ప్రచురించిన కథనం ఆధారంగా, బీహార్ రాష్ట్రానికి చెందిన 63 మంది పిల్లలు పూణే లోని మదర్సా లో చేరడానికి ట్రైన్ లో వెళ్తున్నపుడు వారికి సరైన పత్రాలు లేని కారణంగా బెంగాల్ రైల్వే పోలీసులు వారిని కోల్కతా లోని సీల్దా రైల్వే స్టేషన్ లో నిర్బంధించారని తెలిసింది. ఈ ఘటన 2015 లో జరిగింది.
“The Quint” వారు ఈ ఘటన జరిగినప్పుడు ‘రాష్ట్ర పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్’ చేర్పర్సన్ గా ఉన్న అశోకెండు సేన్ గుప్తాని సంప్రదించినప్పుడు, పిల్లలను సీఆర్పిఎఫ్ మరియు ప్రభుత్వ రైల్వే పోలీస్ ఫోర్స్ (జిఆర్పిఎఫ్) 2015 లో సీల్దా స్టేషన్లో అదుపులోకి తీసుకున్నట్లు ఆయన ధృవీకరించారు. విడుదలైన వెంటనే వారిని తిరిగి ఆయా జిల్లాలకు పంపించారని తెలిపారు. ‘ఉగ్రవాద ట్రైనింగ్’ కోణానికి మరియు ఈ అరెస్టులకు ఏమైనా సంబంధం ఉందా అని అడిగినప్పుడు, అలా అయి ఉండకపోవచ్చు అని, అందుకు తగిన ఆధారాలు లభించలేదని తెలియజేసారు.
చివరగా, పోస్ట్ లో చెప్పినట్టు వీడియో లోని పిల్లలను కోల్కతా పోలీసులు ఉగ్రవాద శిక్షణ తీసుకుంటున్నందుకు అరెస్ట్ చేయలేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?