తమిళనాడు లో RSS కి చెందిన కొందరు యువకులు ముస్లిం మహిళలలను వేదిస్తున్నారంటూ ఒక వీడియోని ‘ప్రతీఅంబేద్కరిస్టు నా బంధువు’ అనే పేజీ ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్దాం.
క్లెయిమ్ (దావా): తమిళనాడు లోని RSS యువకులు కాలేజీకి వెళ్లే ముస్లిం అమ్మాయిలను వేధిస్తున్నారు
.ఫాక్ట్ (నిజం): ఆ వీడియో శ్రీలంక లోని కాలేజీ లో జరిగిన ర్యాగింగ్ వీడియో అని గతంలో చాలా సందర్భాలలో షేర్ చేసారు. అది తమిళనాడు RSS యువకులు కాలేజీకి వెళ్లే ముస్లిం అమ్మాయిలను వేధించడానికి సంబంధించినది అని ఆధారాలు చూపించకుండా అందరిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
తెలుగు లో పోస్ట్ చేసినట్టుగానే ఇంగ్లీష్ లో కూడా చాలా మంది అదే వీడియోని పెట్టి పోస్ట్ చేసారు. ఆ పోస్టుల కింద కామెంట్స్ చూస్తే ఆ వీడియో శ్రీలంక కి సంభందించిన కాలేజీ లో జరిగిన రాగింగ్ సంఘటన అని తెలుస్తుంది. ‘SriLanka college ragging’ అని ఫేస్బుక్ లో సెర్చ్ చేస్తే ‘Saadhullah Jawaamil’ అనే వ్యక్తి శ్రీలంక లోని కాలేజీ లో జరిగిన రాగింగ్ మీద పోస్ట్ చేసిన మూడు వీడియోలు వస్తాయి. వాటిలో ఒకటి ఫేస్బుక్ లో RSS వాళ్ళను నిందిస్తూ పెట్టిన వీడియో లాగా చలామణి అవుతుంది. అలాగే గూగుల్ లో ‘SriLanka college ragging’ అని సెర్చ్ చేస్తే ఇలాంటి చాలా ఘటనల మీద ఆర్టికల్స్ వస్తాయి.
ఆల్ట్ న్యూస్ సంస్థ చేసిన విశ్లేషణ ప్రకారం ఈ సంఘటన “Eastern University, Sri Lanka” లో జరిగింది. దీనికి సంబందించిన వివరాలు కూడా శ్రీలంక వెబ్సైటు లో ఉన్నట్టు అందులో పేర్కొన్నారు. చివరగా వీడియో లో జరిగింది RSS వాళ్ళు ముస్లింల మీద జరిపిన వేదింపులు అని పెట్టిన పోస్ట్ కి ఎటువంటి ఆధారాలు లేవు మరియు అదే వీడియో ఇంతకు ముందే వేరే సందర్భాలలో షేర్ చేయబడినది. కావున పోస్ట్ అందరిని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది.