‘వర్షాన్ని సైతం లేక్కచేయకుండా మొక్కలకు నీరు పోస్తున్న బిజెపి Mp గారు’ అంటూ పెట్టిన ఒక ఫొటోతో కూడిన పోస్టు ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): వర్షంలో మొక్కలకు నీళ్లు పోస్తున్న బీజేపీ ఎంపీ.
ఫాక్ట్ (నిజం): పోస్టులో పెట్టిన ఫొటోలో వర్షం కురుస్తున్నప్పుడు మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపిస్తున్నది 2015లో వాసాయి-విరార్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ కి మేయర్ గా పని చేసిన ప్రవీణా ఠాకూర్ (బహుజన్ వికాస్ అగాడి పార్టీ). కావున, పోస్టులో చేసిన ఆరోపణలో నిజం లేదు.
పోస్టులో ఉన్న ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అది “Indian Express” వారు 2016లో రాసిన ఒక కథనం లో లభించింది. ఆ కథనం ద్వారా వర్షం పడుతున్నప్పుడు మొక్కలకు నీళ్లు పోస్తున్నది మహారాష్ట్ర లోని వాసాయి-విరార్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ కి మేయర్ గా పని చేసిన ప్రవీణా ఠాకూర్ అని తెలిసింది. ఆమె బహుజన్ వికాస్ అగాడి (BVA) పార్టీ నుండి 2015లో మేయర్ గా ఎన్నికయ్యారు. 2016లో మునిసిపల్ కార్పొరేషన్ వెబ్సైటు లో ఆమె ఫోటో కూడా చూడొచ్చు. ప్రస్తుతం తాను 98వ వార్డు మెంబెర్ అని వెబ్సైటు లో ఉంది.
గతంలో కూడా ఈ ఫోటోలో వర్షంలో మొక్కలకు నీళ్లు పోస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీ ఎంల్ఏ అల్కా లంబా అనే ప్రచారం జరిగినట్లుగా తెలిసింది.
చివరగా, ఫొటోలో వర్షం కురుస్తున్నప్పుడు మొక్కలకు నీళ్లు పోస్తున్నది బీజేపీ ఎంపీ కాదు. ఆమె 2015లో వాసాయి-విరార్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ కి మేయర్ గా పని చేసిన ప్రవీణా ఠాకూర్.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?