Fake News, Telugu
 

లండన్ లోని భారతీయుల హోటల్ బోర్డు పై అభినందన్ ఫోటో లేదు

1

ఫేస్బుక్ లో ‘లండన్ లోని భారతీయ హోటల్’ అంటూ IAF వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ గారి ఫోటోతో కూడిన CHAIWAALA హోటల్  సైన్బోర్డు పిక్ తో ఉన్న పోస్ట్ ని  చాలా మంది షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో ఓసారి  విశ్లేషిద్దాం.

క్లెయిమ్ (దావా): లండన్ లోని CHAIWAALA కాఫీ షాప్  ప్రవేశద్వారం వద్ద సైన్బోర్డు  పై అభినందన్ వర్ధమాన్  చిత్రాన్ని పెట్టారు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో పెట్టినది ఫోటోషాప్ చేసిన ఫోటో. కావున పోస్ట్ లో చేసిన ఆరోపణలు అవాస్తవం.

గూగుల్ రివర్స్ ఇమేజ్  సెర్చ్ చేసినప్పుడు UK లో CHAIWAALA కాఫీ షాప్ కి సంబంధించిన వివిధ శాఖల ఫోటోలు వచ్చాయి . వాటిలో లండన్ బ్రాంచ్ ఫోటోని మరియు  పోస్ట్ లో పెట్టిన ఫోటోని చూసినట్లయితే అవి  సరిపోలాయి. ఆ రెండు ఫోటోల్లో షాప్ లోపటి భాగం ఒకే విధంగా ఉన్నపటికీ, కాఫీ షాప్ అసలు ఫోటోలో  సైన్బోర్డు పైన అభినందన్ వర్ధమాన్ గారి ఫోటో లేదు. దీని గురించి BOOM వారు CHAIWAALA యాజమాన్యం వారిని సంప్రదించినప్పుడు వారు ఆరోపణను తిరస్కరించి అది ఒక ఫోటోషాప్ చేయబడిన ఫోటో అని చెప్పారు.

చివరగా, పోస్ట్ లో పెట్టినది ఫోటోషాప్ చేయబడిన ఫోటో.

 

Share.

About Author

1 Comment

  1. selective targetting of bjp as you are being funded by tdp … but just wait and watch.. we will report u to facebook and google and soon will teach u

scroll