Fake News, Telugu
 

రాహుల్ గాంధీ హెలీకాప్టర్ లో సమోసా తింటున్న ఫోటో కేరళ వరద ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేసినప్పటిది కాదు

0

చాలా మంది ఫేస్బుక్ లో ఒక ఫోటో ని పోస్టు చేసి ‘హెలీకాప్టర్ లొ సరదాగా సమోసా తింటూ, కోక్ తాగుతూ కేరళ వరద ప్రాంతాలలొ ఏరియల్ సర్వే చేసిన రాహుల్ గాంధీ’ అంటూ  ఫోటో గురించి పేర్కొంటున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : రాహుల్ గాంధీ హెలీకాప్టర్ లో సమోసా తింటున్న ఫోటో తాను కేరళ వరద ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేసినప్పటిది.       

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటో లోక్ సభ ఎన్నికలు-2019 సమయంలో రాహుల్ గాంధీ మధ్య ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చేసినప్పుడు సమోసాలు తిన్నప్పటిది. కావున, పోస్టులో ఆరోపించిన విషయంలో నిజంలేదు.

పోస్టులో ఉన్న ఫోటోని “rahul Gandhi samosa” అనే ఫిల్టర్ తో గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, “ABP News” వారి వీడియో ఒకటి లభించింది. దానిని వారు ఏప్రిల్ 24, 2019 లో అప్లోడ్ చేసినట్లుగా తెలిసింది. ఆ వీడియో క్రింద ఉన్న వివరణ ద్వారా అది లోక్ సభ ఎన్నికలు-2019 సమయంలో రాహుల్ గాంధీ మధ్య ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చేసినప్పుడు సమోసాలు తిన్నప్పటిదని తెలిసింది. పోస్టులో పెట్టిన ఫోటో కూడా ఆ సందర్భానికి సంబంధించినదే అని ఆ వీడియో ద్వారా తెలుస్తోంది.

చివరగా, రాహుల్ గాంధీ సమోసాలు తింటున్న ఫోటో తాను కేరళ వరద ప్రాంతాలలొ ఏరియల్ సర్వే చేసినప్పటిది కాదు. అది మధ్య ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చేసినప్పటిది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll