తెలంగాణ బీజేపీ MLA రాజా సింగ్ చెల్లెలు ఇస్లాం మతంలోకి మారింది అంటూ ఒక అమ్మాయి ఫోటో ఉన్న పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): రాజా సింగ్ చెల్లెలు అయిన మాయా దేవి ఇస్లాం మతంలోకి మారింది.
ఫాక్ట్ (నిజం): ఫోటోలోని అమ్మాయి పేరు అతిర/అయేషా. తను కేరళ అమ్మాయి. రెండు సంవత్సరాల ముందు తను హిందు మతంలో నుండి ఇస్లాంలోకి మారింది. తనకు రాజా సింగ్ కి ఎటువంటి సంబంధం లేదు. తన మీద ఇలాంటిదే నాలుగేళ్ళ క్రితం ఒక వార్త వచ్చినప్పుడు రాజా సింగ్ దాన్ని ఖండించారు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
పోస్ట్ లోని అమ్మాయి ఫోటోని క్రాప్ చేసి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోతో ఉన్న ‘The News Minute’ ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ లో ఆ అమ్మాయి కేరళ అమ్మాయని, తన పేరు అతిర (‘అయేషా’ – మతం మార్చుకున్నాక పేరు) అని ఉంటుంది. రెండు సంవత్సరాల ముందు తను ఇస్లాం మతంలోకి మారింది. తనకు రాజా సింగ్ కి ఎటువంటి సంబంధం లేదు.
అలానే గూగుల్ లో ‘Raja Singh sister accepted Islam’ అని వెతకగా, నాలుగేళ్ళ క్రితం ప్రచురించిన ‘The News Minute’ ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. దాని ప్రకారం రాజా సింగ్ 2015 లో ఒక వార్తా పత్రిక పై ఇదే విషయం మీద పరువు నష్టం దావా కూడా వేసాడు. ఎందుకంటే ఆ వార్తా పత్రిక వాళ్ళు సరైన వివరాలు తెలుసుకోకుండా రాజా సింగ్ మేనకోడలు ఇస్లాం లోకి మారిందని రాసారు. ఆ సమయం లో రాజా సింగ్ ఆ వార్తను తీవ్రంగా ఖండించారు.
పోస్ట్ లోని ఫోటో చూస్తే వార్త 6th జూన్, 2019 నాడు ‘The News Minute’ వెబ్ సైట్ లో ప్రచురించినట్టుగా చూడొచ్చు. కానీ వారి వెబ్ సైటులో వెతికితే అలాంటి వార్త ఏమీ దొరకదు. పోస్ట్ వైరల్ అయ్యాక ‘The News Minute’ వారు ఈ వార్తను ఖండిస్తూ ఒక ఆర్టికల్ కూడా ప్రచురించారు.
చివరగా, రాజా సింగ్ చెల్లెలు ఇస్లాం లోకి మారిందని వస్తున్న వార్తల్లో నిజం లేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?