అప్డేట్: నవంబర్ 10, 2019 న టీ.ఎన్.శేషన్ మరణించారు. ఈ విషయం పై ప్రధాని మోడీ చేసిన ట్వీట్ ని ఇక్కడ చూడవొచ్చు. తను మరణించినట్టు ఇంతకు ముందు వైరల్ అయినప్పుడు ఏప్రిల్ 2019 లో ఈ ఆర్టికల్ రాయబడింది.
మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ టీ.ఎన్.శేషన్ చనిపోయారంటూ ఉన్న పోస్ట్ ని చాలా మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు . ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ టీ.ఎన్.శేషన్ మరణించారు.
ఫాక్ట్ (నిజం): టీ.ఎన్.శేషన్ భారతీయ ఎన్నికల చరిత్ర లో చాలా ముఖ్య పాత్ర పోషించారు. కాబట్టి తనకు ఏమైనా జరిగితే ప్రముఖ వార్తా పత్రికలు దాన్ని ప్రచురించేవి. కానీ ఎక్కడా కూడా తను మరణించిన వార్త దొరకలేదు. కావున పోస్ట్ లో చెప్పినట్టుగా టీ.ఎన్.శేషన్ మరణించలేదు.
పోస్ట్ లో ఎంత వరకు నిజముందో తెలుసుకోవడానికి గూగుల్ లో ‘T N Seshan death’ అని వెతికితే గత సంవత్సరంలో కూడా ఇదే న్యూస్ వైరల్ అయ్యిందని తెలుస్తుంది. 2018 మర్చి లో తన భార్య మరణించింది, అప్పుడు కూడా తరువాతి రోజు టీ.ఎన్.శేషన్ చనిపోయాడంటూ ఒక ఫేక్ న్యూస్ వైరల్ అయ్యింది. అప్పట్లో చాలా సంస్థలు ఆ ఫేక్ న్యూస్ పై ఆర్టికల్స్ ప్రచురించాయి. మళ్ళీ ఇప్పుడు అదే వార్త తిరిగి షేర్ చేయబడుతుంది.
భారత దేశ ఎన్నికల చరిత్ర లో టీ.ఎన్.శేషన్ చాలా ముఖ్య పాత్ర పోషించారు. 1990 నుండి 1996 వరకు చీఫ్ ఎన్నికల కమీషనర్ గా బాధ్యతలు నిర్వహించిన తను ఎన్నికల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చారు. అంత ప్రాముఖ్యం గల వ్యక్తి మరణిస్తే వివిధ వార్తా పత్రికలు తప్పకుండా ఆ వార్తని ప్రచురిస్తాయి కానీ అలాంటి ఎటువంటి వార్త కూడా దొరకలేదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
చివరగా, మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ టీ.ఎన్.శేషన్ మరణించలేదు. ఆయన భార్య మాత్రం గత సంవత్సరం చనిపోయారు.
1 Comment
Great job Thank you