Fake News, Telugu
 

భారత సైన్యం పాత సెర్చ్ ఆపేరేషన్స్ వీడియోను కాశ్మీర్‌లో ఉగ్రవాదులను మట్టు పెడుతున్న భారత సైన్యం అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలను మోహరించిన నేపథ్యంలో,  ‘జమ్మూకాశ్మీర్ లో తీవ్రవాదులను వెంటాడి వేటాడి మరి మట్టుపెడుతున్న మన భారత సైనికులు‘ అంటూ ఒక వీడియోని పోస్ట్ చేస్తున్నారు.  ఆ పోస్టులో చెప్తున్న విషయంలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కాశ్మీర్‌ లో ఉగ్రవాదులను మట్టు పెడుతున్న భారత సైన్యం.       

ఫాక్ట్ (నిజం): పోస్ట్ చేసిన వీడియో మూడేళ్ల క్రితం కాశ్మీర్ లో భారత సైన్యం సెర్చ్ ఆపేరేషన్స్ నిర్వహిస్తున్నప్పటి వీడియో. కావున, పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో నిజం లేదు.

పోస్ట్ చేసిన వీడియోలో “డిడి న్యూస్” లోగో ఉంది. యూట్యూబ్‌లో సెర్చ్ చేసినపుడు, అదే వీడియో
డిడి న్యూస్ ఛానల్ లో వెతికితే “Know how Indian Army carries out search operations in Kashmir valley (Hindi)” అనే పేరుతో కనబడుతుంది. వీడియో ఎప్పుడు పెట్టారు అని చూస్తే, అక్టోబర్ 25, 2016 న అప్‌లోడ్ చేయబడినట్లు తెలుస్తుంది. ఈ వీడియో క్రింద ఈ వివరణ ఉంటుంది- “జమ్మూ కాశ్మీరులోయలో భారత సైనికులు కార్డాన్ మరియు సెర్చ్ ఆపేరేషన్స్ ఎలా నిర్వహిస్తాయో మీకు తెలుసా? మరియు ఒక గ్రామంలోని ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు తెలిస్తే దళాలు ఎలా ముందుకు వెళ్తాయో తెలుసా? మా కరస్పాండెంట్ నందితా డాగర్ వివరిస్తున్నారు”.

చివరగా, భారత సైన్యం పాత సెర్చ్ ఆపేరేషన్స్ వీడియోను కాశ్మీర్‌లో ఉగ్రవాదులను మట్టు పెడుతున్న భారత సైన్యం అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll