పుల్వామా దాడి వెనకాల బీ.జే.పీ హస్తముందని ఫోన్ సంభాషణతో కూడిన ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంత వరకు నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం.
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
క్లెయిమ్ (దావా): పుల్వామా దాడి వెనకాల బీ.జే.పీ నాయకుల హస్తం. కావాలంటే ఫోన్ సంభాషణని వినండి.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో చెప్పినట్టుగా ఫోన్ లోని వాయిస్లు బీ.జే.పీ నాయకులవే కానీ అవి గతంలో వేరు వేరు సందర్భాలలో మాట్లాడిన మాటలు. ఆ మాటలను తమకు నచ్చిన విధంగా పెట్టి పుల్వామా దాడి ప్లాన్ చేసినట్టుగా చూపెట్టారు. కావున ఆ ఫోన్ సంభాషణ వాస్తవానికి జరగలేదు.
గూగుల్ లో ‘BJP leaders audio conversation on pulwama attack’ అని సెర్చ్ చేసినప్పుడు ఇండియా టుడే ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ ప్రకారం వీడియో లో బీ.జే.పీ ని నిందిస్తున్న వ్యక్తి పేరు అవి దండియా. ఆడియో క్లిప్ ని వివిధ సందర్భాలలో బీ.జే.పీ నాయకులు మాట్లాడిన మాటలను జోడించి తాయారు చేయబడింది. ఫేక్ ఆడియో క్లిప్ ని ఫేస్బుక్ లో పెట్టినందుకు పోలీసు వారు తన పై కేసు కూడా బుక్ చేసారు.
చివరగా, ఫోన్ సంభాషణ లో బీ.జే.పీ నాయకులు వివిధ సందర్భాలలో మాట్లాడిన మాటలని జోడించారు.