Fake News, Telugu
 

ఫోటోలో ఉన్న వ్యక్తి తన ఇంటి ముందు పాస్టర్లకు వ్యతిరేకంగా పోస్టర్ పెట్టలేదు

0

తన ఇంటిలోకి పాస్టర్లను రావొద్దని హెచ్చరిస్తూ ఒకతను తన ఇంటి ముందు పోస్టర్ పెట్టాడంటూ ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఫోటోలో ఉన్న వ్యక్తి తన ఇంటి ముందు పాస్టర్లకు వ్యతిరేకంగా పోస్టర్ పెట్టాడు.

ఫాక్ట్ (నిజం): పోస్టర్ మీద వివిధ బాషల్లో పలు రకాలుగా రాసి ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ లో దొరుకుతాయి. చాలా వరకు ఫోటోల్లో పోస్టర్ మీద దొంగతనం గురించి ఉన్నట్టుగా చూడవచ్చు. ఫోటోని జూమ్ చేసి చూస్తే పోస్టర్ ని ఎడిట్ చేసినట్టు చూడవచ్చు. కావున పోస్ట్ లో చెప్పినట్టుగా అతను పాస్టర్లకు వ్యతిరేకంగా పోస్టర్ పెట్టలేదు.      

పోస్ట్ లోని ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ లో వెతకగా, పోస్టర్ మీద వివిధ బాషల్లో పలు రకాలుగా ఉన్న ఫోటోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి.  చాలా వరకు ఫోటోల్లో పోస్టర్ మీద వివిధ బాషలల్లో (మరాఠీ, హిందీ, ఇంగ్లీషు) దొంగలను ఉద్దేశించి రాసినట్టు చూడవచ్చు. ఒక ఫోటోలో ‘భార్య ఉంది జాగ్రత్త’ అని పోస్టర్ మీద రాసి ఉన్నట్టు చూడవచ్చు. కానీ అన్ని ఫోటోలను జూమ్ చేసి సరిగ్గా చూస్తే, పోస్టర్ ని ఎడిట్ చేసినట్టు తెలుస్తుంది. మరాఠీ బాష లో ఉన్న ఫోటో ఒక్కటి ఒరిజినల్ లాగా కనపడుతది. కాకపోతే మరాఠీ ఫోటోకి నమ్మదగిన ఆధారం ఇంటర్నెట్ లో దొరకలేదు.

చివరగా, ఫోటోలో ఉన్న వ్యక్తి తన ఇంటి ముందు పాస్టర్లకు వ్యతిరేకంగా పోస్టర్ పెట్టలేదు.  

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll