Fake News, Telugu
 

ఫోటోలో ఉన్నది న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ కాన్సెప్ట్ మాత్రమే. నిజమైన బిల్డింగ్ కాదు.

0

ఢిల్లీ లోని మెట్రో రైల్ స్టేషన్ అంటూ ఒక ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఫోటో లో ఉన్నది ఢిల్లీ లోని మెట్రో రైల్ స్టేషన్.

ఫాక్ట్ (నిజం): ఫోటో లో ఉన్నది కాన్సెప్ట్ మాత్రమే. నిజమైన బిల్డింగ్ కాదు. ఢిల్లీ లోని రైల్వే స్టేషన్ ని పునరుద్దరించాలని 2007 లో ప్రభుత్వం అనుకునప్పుడు ఈ కాన్సెప్ట్ ని ఫారెల్స్ అనే సంస్థ ఇచ్చారు. కావున ఒక కాన్సెప్ట్ ని చూపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికినప్పుడు,  హరేల్ల్స్ సంస్థ కి సంబంధించిన వెబ్ సైట్ లింక్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ వెబ్ సైట్ లో వాళ్ళు ప్రాజెక్ట్స్ సెక్షన్ లో న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ అంటూ అదే ఫోటో ని పెట్టారు. ఇండియన్ రైల్వే  2007 లో ఢిల్లీ  రైల్వే స్టేషన్ పునరుద్ధరించేందుకు ఫారెల్స్ సంస్థ ని కమిషన్ చేయగా వారు 2009 లో ఫోటోలో ఉన్న కాన్సెప్ట్ ని ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అది అమలు కాలేదు. కావున ఫోటో న్యూ ఢిల్లీ కి సంబంధించిందే కానీ అది ఒక కాన్సెప్ట్ మాత్రమే.

వెబ్ సైట్ లో ఇచ్చిన కాన్సెప్ట్ ప్లాన్ ఇప్పుడు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో కనపడదు.

చివరగా, ఫోటోలో ఉన్నది న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ కాన్సెప్ట్ మాత్రమే.

Share.

About Author

Comments are closed.

scroll