Fake News, Telugu
 

పోస్ట్ లో ఉన్న ఫోటో ఇందిరా గాంధీ అంతిమ యాత్రది కాదు

0

ఫేస్బుక్ లో రాజీవ్ గాంధీ మరియు రాహుల్ గాంధీ కలిసి ఉన్న చిత్రంతో కూడిన పోస్ట్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఇందిరా గాంధీ అంతిమ సంస్కారాలు ముస్లిం నమాజ్ తో పూర్తి చేశారు అని అందులో ఆరోపించారు. ఈ విషయాలు ఎంతవరకు వాస్తవమో  ఓసారి విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఇందిరా గాంధీ చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ  ,రాహుల్ గాంధీ ముస్లిం పద్దతిలో నమాజ్ చేసి అంతిమ సంస్కారం చేశారు

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఉన్న ఫోటో 1988 లో రాజీవ్ గాంధీ  ,రాహుల్ గాంధీ మరియు పి.వి. నరసింహారావు లు స్వాతంత్య్ర సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ అంతిమ యాత్రకు హాజరైనప్పడు తీసిన ఫోటో. కావున పైన పోస్ట్ లో చేసిన ఆరోపణ తప్పు.

పోస్ట్ లో ఉన్న చిత్రాన్ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది 1988 లో స్వాతంత్య్ర సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ అలియాస్ బచ్చా ఖాన్ మరణాంతరం పాకిస్థాన్ లోని పెషావర్ లో జరిగిన అంతిమ యాత్రకు రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ మరియు పి.వి. నరసింహారావు లు హాజరైనప్పడు తీసిన ఫోటో అని తెలిసింది.

ఇదే విషయం గురించి ప్రముఖ వార్తా సంస్థ BBC తెలుగు వారు ఒక కథనాన్ని రాసారు. ఆ కథనం యొక్క కొంత భాగాన్ని స్క్రీన్ షాట్ తీసి కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

చివరగా, పోస్ట్ లో ఉన్నది స్వాతంత్య్ర సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ అంతిమ యాత్ర ముందు తీయబడిన ఫోటో.

Share.

About Author

Comments are closed.

scroll